మీ కారు మంచి ధరకు అమ్ముడుపోవాలంటే - ఇలా చేయండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 10:02 AM IST

Car Resale

How to Increase Car Resale Value : కొత్తకారు కొనాలనే ఆలోచన కావొచ్చు.. మరేదైనా కారణం కావొచ్చు.. చాలా మంది కారు అమ్మేయాలని చూస్తుంటారు. కానీ.. సెకండ్ హ్యాండ్ కారు కదా అని, కొనుగోలు చేసేవారు తక్కువ ధరకే అడుగుతుంటారు. అయితే.. ముందు నుంచే కొన్ని టిప్స్ ఫాలో అయితే.. మీ కారు రీసేల్ వాల్యూ పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Best Tips to Improve Car Resale Value : కారు కొనేవారు తక్కువ ధరకే రావాలని అనుకుంటారు. అదే సమయంలో అమ్మేవారు మంచి ధర రావాలని కోరుకుంటారు. మరి.. విక్రయించే వారికి మంచి ధర రావాలంటే కొన్ని సూచనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సర్వీస్ హిస్టరీ డాక్యుమెంట్స్‌ : రెగ్యులర్​గా సర్వీస్ చేయించండి. సర్వీస్ హిస్టరీ రికార్డులు దగ్గర పెట్టుకోండి. ఇవి మీ కారు రీసేల్ పెంచడంలో చాలా బాగా సహాయపడతాయి. మీ కారు సర్వీస్ హిస్టరీ రికార్డులు.. వెహికల్​ను రెగ్యులర్ సర్వీసింగ్ చేయించిన నమ్మకాన్ని కొనుగోలుదారునికి కలిగిస్తాయి. అంతేకాదు.. సమయానికి సర్వీసింగ్ చేస్తే.. మీ కారు కూడా మంచి కండీషన్​లో ఉంటుంది. దాంతో.. మంచి ధరకు అమ్మేయవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇప్పటివరకు కారు సర్వీస్ హిస్టరీ లేకపోతే వెంటనే మీ సర్వీస్ సెంటర్​ను సంప్రదించి ఆ పత్రాలను పొందండి. కారు బీమా రెన్యూవల్ చేయించడం మరిచిపోవద్దు. ఇది కూడా కారుకు మంచి ధర రావడంలో సహాయపడుతుంది.

మెయింటెనెన్స్ : మెయింటెనెన్స్ కూడా.. ధరలో కీలక పాత్ర పోషిస్తుంది. కారులో ఏదైనా పార్ట్ దెబ్బతిన్నప్పుడు ఒరిజినల్ పార్ట్స్​నే వేయించండి. ఎందుకంటే అవి కారును కొత్తదానిలా చేస్తాయి. దాంతో రీసేల్ వ్యాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది.

కారు క్లీన్​గా : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే కారులో అనవసరమైన వస్తువులు పెడుతూ దానిని డస్ట్​బిన్​లా మార్చుతుంటారు. అలాకాకుండా ఎప్పుడు వెహికల్ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే కారు మంచి కండిషన్​లో ఉన్నా బయట చూడడానికి అసహ్యంగా కనిపిస్తే కొనుగోలుదారునికి అది డొక్కు కారులా అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కారును లోపల, బయట క్లీన్​గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

మోడిఫికేషన్స్ చేయకండి : మీ కారు రీసేల్ వ్యాల్యూ పెరగాలంటే దానిని వీలైనంతవరకు మోడిఫికేషన్స్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే.. అది కొనుగోలుదారునికి నచ్చకపోవచ్చు. కారు రూపం దెబ్బతిన్నదని వారు భావించొచ్చు. అప్పుడు వారికి నచ్చిన రేటుకే కారును విక్రయించాల్సి రావొచ్చు. దీనివల్ల మీకు మోడిఫికేషన్ ఖర్చు మైనస్ అవుతుంది. ఇటు రీసేల్ వాల్యూ తగ్గుతుంది. ఇలా రెండు విధాలా నష్టమే. కాబట్టి మోడిఫికేషన్స్ మానుకోవడం మంచిది.

కారు కొనుగోలు చేస్తున్నారా? - ఈ సేఫ్టీ ఫీచర్స్ తప్పకుండా ఉండేలా చూసుకోండి!

ఇంజిన్ మోడ్స్, పెర్ఫార్మన్స్ : మంచి ధరకు కారును అమ్మాలనుకుంటే మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేమిటంటే.. ఇంజిన్ మోడ్స్​ను ఎప్పుడూ మార్చకండి. ఎందుకంటే మీరు అలా మార్చే క్రమంలో కారుకు ఏదైనా డ్యామేజ్ కలిగించి ఉంటారనే కోణంలో కొనుగోలుదారుడు ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కారును ఎలా కొన్నారో.. అలాగే ఉండేలా చూసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

డ్రైవింగ్ కండీషన్‌ : కారు కొనేవారు.. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతనే కొంటారు. కాబట్టి మంచి డ్రైవింగ్ కండీషన్​లో ఉంచడం చాలా అవసరం. కాబట్టి.. కారు ఎలా నడుస్తోందనే దానిపై దృష్టి పెట్టండి. క్లచ్, బ్రేక్ సరైన షేప్​లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. లేదంటే రీసేల్ వ్యాల్యూ పడిపోవచ్చు.

ట్రాఫిక్ ఫైన్లు : మీ కారుపైన ఏవైనా ఫైన్లు, కేసులు ఉన్నట్లయితే కొనుగోలు దారుడు చాలా తక్కువ ధరకు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ కారుపై ఎలాంటి ట్రాఫిక్ ఫైన్లు, కేసులు లేకుండా చూసుకోవడం మంచిది. ఈ టిప్స్ పాటిస్తే మీ కారు అనుకున్న దానికంటే ఒకింత ఎక్కువకే అమ్ముడుపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మీ కారు ఇచ్చే ఈ సిగ్నల్స్‌ చూస్తున్నారా? - లేకపోతే ఇంజిన్‌ ఖతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.