మీ షూస్ నుంచి దుర్వాసన వస్తోందా? - ఇలా చెక్ పెట్టండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 2:09 PM IST

Smelly Shoes

Tips for Smelly Shoes : చక్కటి డ్రెస్సింగ్​ స్టైల్​కు.. సూపర్ లుక్ ఇస్తాయి షూస్. అందుకే.. ఆఫీస్, ఫంక్షన్స్, పార్టీస్.. ఎక్కడికి వెళ్లినా షూస్ షూస్​ వేసుకుని వెళ్తుంటారు చాలా మంది. కానీ, కొన్నిసార్లు షూస్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. మీ షూస్ కూడా అలా దుర్వాసన వెదజల్లుతుంటే.. ఈ టిప్స్​తో ఈజీగా చెక్ పెట్టండి.

Best Tips for Smelly Shoes : సాధారణంగా సాక్సులు బ్యాడ్ స్మెల్ వస్తుంటాయి. ఎక్కువ రోజులు శుభ్రం చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. కానీ.. ఈ రోజుల్లో చాలా మంది సాక్సులు లేకుండానే షూస్ ధరిస్తున్నారు. దీంతో.. చెమట పట్టి బ్యాడ్ స్మెల్ వస్తుంటాయి. ఒక్కోసారి ఈ దుర్వాసన భరించలేని విధంగా ఉంటుంది. సమ్మర్​లో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. మరి, ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వంట సోడా : మీ షూస్ నుంచి వచ్చే దుర్వాసన పోగొట్టడానికి బేకింగ్ సోడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది తేమతోపాటు బ్యాక్టీరియాను నశింపచేయడంలోనూ సహజ నివారణిగా ఉపయోగపడుతుంది. మీ బూట్లు బ్యాడ్ స్మెల్ వస్తుంటే వాటిలో బేకింగ్ సోడా చల్లి ఒక రాత్రంతా ఉంచండి. మార్నింగ్ పాత బ్రష్​తో క్లీన్ చేసుకోండి. అంతే బ్యాడ్ స్మెల్ ఇట్టే మాయమవుతుంది.

వైట్ వెనిగర్ : ఇది కూడా బూట్ల నుంచి దుర్వాసనను పోగొట్టడంలో చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుంది. సూపర్ మార్కెట్​లో దొరికే దీనిని నీటితో సమానంగా ఒక స్ప్రే బాటిల్​లో కలుపుకోవాలి. అయితే ఇది అప్లై చేసేముందు షూస్ శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత వాటి లోపల ఈ ద్రావణాన్ని స్ప్రే చేయాలి. ఆపై వాటిని బాగా ఆరనివ్వాలి.

చెప్పుల విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా? - ఆర్థిక నష్టాలు తప్పవట!

లవంగం నూనె : టీట్రీ ఆయిల్, దేవదారు, లవంగం వంటి కొన్ని నూనెలు కూడా బూట్ల చెడు వాసనను తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. 2007లో మైకోబయాలజీ అనే జర్నల్​లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. లవంగం నూనె బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధించి సువాసనను వెదజల్లుతుందని వెల్లడైంది. అవసరమైతే మీరు బేకింగ్ సోడా లేదా వెనిగర్​తో కలిపి ఈ ఆయిల్స్ యూజ్ చేయవచ్చంటున్నారు నిపుణులు.

ఎండలో ఉంచడం : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఎక్కడికైనా వెళ్లిరాగానే.. షూస్ విప్పి ఎక్కడో గాలి తగలని చోట మూలకు పెట్టేస్తుంటారు. అలాకాకుండా వాటిని కాసేపు ఎండలో ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే వాటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియా నశించడంలో సూర్యరశ్మి చాలా బాగా పనిచేస్తుంది.

సాక్స్ : మీ బూట్ల నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే మీరు ఎల్లప్పుడూ సాక్స్ ధరించాలి. అదేవిధంగా ఆ సాక్స్​లను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. అలాగే వాటిని తరచుగా మారుస్తుండాలి.

ఇవేకాకుండా షూస్​ను కనీసం వారానికి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. ఇన్సోల్​ను సైతం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. అలాగే ఇన్సోల్ అరిగిపోతే వెంటనే మార్చుతుండాలి. ఈ టిప్స్ పాటిస్తే.. మీ షూస్ నుంచి బ్యాడ్ స్మెల్ ఎప్పటికీ రాదని నిపుణులు సూచిస్తున్నారు.

చెప్పులు పారేశాడు.. సెలబ్రిటీ అయ్యాడు.. డబ్బే డబ్బు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.