ETV Bharat / bharat

గ్యాంగ్​స్టర్​ ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు పూర్తి- పోలీసుల పటిష్ఠ భద్రత మధ్య అంతిమ సంస్కారాలు - Mukhtar Ansari Funeral Rites

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 11:19 AM IST

Mukhtar Ansari Funeral Rites : కట్టుదిట్టమైన భద్రత మధ్య గ్యాంగ్​స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్‌ అన్సారీ అంత్యక్రియలు శనివారం పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు. కానీ, ఆయన భార్య, కుమారుడు మాత్రం అంతక్రియలకు హాజరు కాలేదు.

Etv Bharat
Etv Bharat

Mukhtar Ansari Funeral Rites : గుండెపోటుతో మరణించిన గ్యాంగ్‌స్టర్‌, రాజకీయవేత్త ముఖ్తార్‌ అన్సారీ అంత్యక్రియలు శనివారం ఉత్తర్​ప్రదేశ్​లోని గాజీపుర్​లో పూర్తయ్యాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య కాలీ బాగ్​లో​ని శ్మశాన వాటికలో అంతక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ప్రత్యేకమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అయితే ఈ అంతక్రియలకు అన్సారీ భార్య అఫ్షాన్ అన్సారీ, కుమారుడు అబ్బాస్ హాజరుకాలేదు. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు, స్మశానవాటికలోకి ప్రవేశించేందుకు బారికేడ్లను బద్దలు కొట్టడం వల్ల గందరగోళం నెలకొంది.

రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్
యూపీలోని బాందా జైలులో శిక్ష అనుభవిస్తున్న 63 ఏళ్ల అన్సారీ గురువారం రాత్రి 8.25 గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో జైలు అధికారులు ఆయనను దుర్గావతి మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స ప్రారంభించినప్పటికీ గుండెపోటుతో ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం పోస్ట్​మార్టమ్​ పరీక్షలు నిర్వహించి కుటుంబసభ్యులకు అందించారు. మరవైపు రాష్ట్రంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి 144 సెక్షన్​ను విధించారు. ప్రజలు ఎక్కడా గుమికూడదని ప్రకటించారు. బందా, మౌ, గాజీపూర్‌, వారణాసి జిల్లాలో అదనపు బలగాలను మోహరించారు. అన్సారీ మృతిపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు పోలీసుల ఐటీ సెల్‌ గట్టి నిఘా పెట్టింది.

ముఖ్తార్​కు స్లో పాయిజన్
అయితే అన్సారీ మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు ఉమర్‌ అన్సారీ మాత్రం తన తండ్రికి 'స్లో పాయిజన్' ఇచ్చారని ఆరోపిస్తున్నారు. రెండురోజుల క్రితం తాను ఆయన్ను కలవడానికి వెళ్లినప్పుడు అనుమతించలేదని ఉమర్​ చెప్పారు. అంతకుముందు ముఖ్తార్ సోదురుడైన గాజీపుర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ సైతం ఇదే తరహాలో చెప్పారు.

ముఖ్తార్ అన్సారీపై 61 కేసులు
ఉత్తర్​ప్రదేశ్​లోని మౌ ప్రాంతానికి చెందిన ముఖ్తార్ అన్సారీపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. అందులో 15 మర్డర్ కేసులు ఉన్నాయి. 1980ల్లో గ్యాంగ్‌ సభ్యుడిగా చేరారు అన్సారీ. ఆ తర్వాత 1990ల్లో తానే సొంతంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మౌ, ఘాజీపుర్‌, వారణాసి ప్రాంతాల్లో దోపిడీలు, కిడ్నాపులకు పాల్పడేది అన్సారీ గ్యాంగ్. అయితే 2004లో అన్సారీ వద్ద మెషిన్‌ గన్‌ బయటపడడం వల్ల పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు.

తల్లీకూతుళ్లను నరికి చంపిన సైకో కిల్లర్​- ప్రాణభయంతో పరార్​- ఇంతకుముందు కూడా! - Husband Kills Wife And Children

300అడుగుల లోయలో పడ్డ కారు- 10 మంది మృతి - Jammu Kashmir Car Accident

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.