ETV Bharat / bharat

'విదేశాల్లో ఉన్న మన విగ్రహాలను తెస్తున్నాం​- విదేశీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి'

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 11:11 AM IST

Updated : Feb 19, 2024, 1:48 PM IST

Kalki Dham Inauguration
Kalki Dham Inauguration

Kalki Dham Temple Sambhal Modi : మన ప్రాచీన శిల్పాలను విదేశాల నుంచి తీసుకొస్తున్నామని, రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు కూడా వస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఉత్తర్​ప్రదేశ్​లో కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

Kalki Dham Temple Sambhal Modi : విదేశాలకు తరలి వెళ్లిన పురాతన విగ్రహాలను నేడు భారత దేశం తిరిగి తీసుకువస్తోందని, రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లాలో కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ నమూనాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, శ్రీ కల్కిధామ్ నిర్మాణ్ ట్రస్ట్ ఛైర్మన్ ఆచార్య ప్రమోద్ కృష్ణం పాల్గొన్నారు.

ఆలయ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇంతమంది ఆచార్యులు, సాధువుల సమక్షంలో ఈ కల్కిధామ్‌ క్షేత్రానికి శంకుస్థాపన చేయటం సంతోషంగా ఉందని అన్నారు . కల్కిధామ్ భారతీయ విశ్వాసానికి మరో గొప్ప కేంద్రంగా ఆవిర్భవిస్తుందని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని కూడా ప్రస్తావించారు. ఆయన(ఛత్రపతి శివాజీ) పాదాలకు నమస్కరించి నివాళులర్పిస్తున్నట్టు చెప్పారు. ఈ రోజు మరింత పవిత్రమైందని, అందరికీ స్ఫూర్తిదాయకం అవుతుందని మోదీ వాఖ్యానించారు. ఈ కార్యక్రమం అనంతరం రూ.10 లక్షల కోట్ల కంటే విలువైన 14,500 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

"నేడు ఒకవైపు మన తీర్థక్షేత్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. మరోవైపు నగరాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు రూపుదిద్దుకుంటున్నాయి. నేడు దేవాలయాల నిర్మాణం జరుగుతోంది. దేశవ్యాప్తంగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణం కూడా అవుతోంది. మన ప్రాచీన శిల్పాలను విదేశాల నుంచి తీసుకొస్తున్నాము. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి."

- నరేంద్ర మోదీ , ప్రధాన మంత్రి

18ఏళ్ల కల సాకారం!
"ప్రధాని నరేంద్రమోదీ కల్కిధామ్ శంకుస్థపానకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. దేశంలోని నలుమూలల నుంచి వేలాది మంది సాధువులు ఇక్కడికి తరలివచ్చి 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సనాతన ధర్మ కలను సాకారం చేశారు" అని కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ ఛైర్మన్ ఆచార్య ప్రమోద్ తెలిపారు.

అభివృద్ధి పథంలో భారత్​
"అయోధ్య రామమందిరం, అబుదాబీలో హిందూ దేవాలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కల్కిధామ్ శంకుస్థాపనకు వచ్చారు. గత సంవత్సరాల్లో మనం కొత్త భారతదేశాన్ని చూశాం. ఇంకా మన దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది" అని ఉత్తర్​ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.

ప్రపంచంలోని మొదటి దేవాలయంగా!
ఈ కల్కి ధామ్ పుణ్యక్షేత్రాన్ని 5 ఎకరాల్లో 108 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. ఈ దేవాలయంలో 10 గర్భగుడులు ఉంటాయి. అందులో 10వ గర్భగుడిలో కల్కి అవతారం ఉంటుంది. పురాణాల ప్రకారం కలియుగం 4,32,000 సంవత్సరాలు. కలియుగ చివరి దశ ప్రారంభం కాగానే విష్ణువు కల్కి అవతారం ఎత్తాడు. ప్రస్తుతం మనం మొదటి దశలో ఉన్నామని చెబుతుంటారు. ఈ విధంగా ప్రపంచంలోనే దేవుడు పుట్టకముందే విగ్రహన్ని ప్రతిష్ఠించిన దేవాలయంగా ఈ కల్కి ధామ్ నిలుస్తోంది!

అయోధ్యకు సైకిల్ యాత్ర- 4రోజుల్లో 1100కి.మీ జర్నీ- రామయ్య దర్శనమే పెద్ద అవార్డ్!

గుల్జార్​, రామభద్రాచార్యకు జ్ఞాన్​పీఠ్- ఉర్దూ కవి, సంస్కృత పండితునికి దక్కిన గౌరవం

Last Updated :Feb 19, 2024, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.