ETV Bharat / bharat

చనిపోయిన పామును 'ఫ్రై' చేసి తిన్న ఇద్దరు చిన్నారులు- చివరకు ఏమైందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 4:09 PM IST

Children Eat Snake : చనిపోయిన పామును మంటలో కాల్చి తినేశారు ఇద్దరు చిన్నారులు. అందులో ఒకరి ఆరోగ్యం క్షీణించడం వల్ల అసలు విషయం బయటపడింది. బిహార్​లో జరిగిందీ ఘటన.

Children Eat Snake
Children Eat Snake

Children Eat Snake : సాధారణంగా పాములను చూస్తే భయపడతాం. కొందరైతే కిలోమీటర్ల మేర పరుగులు తీస్తారు! అలాంటిది బిహార్​కు చెందిన ఇద్దరు చిన్నారులు మాత్రం చనిపోయిన పామును మంటల్లో ఫ్రై చేసి తినేశారు. అందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడం వల్ల అసలు విషయం బయటపడింది. దీంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. అసలేం జరిగిందంటే?

జముయూ జిల్లాలోని ఖైరా బ్లాక్​ ఖదుయ్ బరియార్​పుర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఫర్హాద్​తోపాటు మరో చిన్నారి ఊర్లో ఆడుకున్నారు. ఆ సమయంలో చనిపోయి ఉన్న పామును గుర్తించి అక్కడే మంటల్లో కాల్చి తినేశారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నారు. అయితే ఫర్హాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఏమైందని అతడిని కుటుంబసభ్యులు అడగ్గా భయపడి ఏమీ చెప్పలేదు.

కొద్దిసేపటి తర్వాత మొత్తం విషయాన్ని చెప్పాడు. వెంటనే ఫర్హాద్​ను అతడి కుటుంబసభ్యులు ఖైరా పీహెచ్​సీకి తీసుకెళ్లారు. కానీ ఆరోగ్యం కుదుటపడలేదు. ఆ తర్వాత జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయ స్థితి నుంచి చిన్నారి బయటపడినట్లు వైద్యులు తెలిపారు. తన కుమారుడికి మరో చిన్నారి బలవంతంగా పామును తినిపించాడని ఫర్హాద్ తల్లి రూబీ ఆరోపించింది. అందుకే ఆరోగ్యం క్షీణించిందని చెప్పింది.

సర్పంతో ఆస్పత్రికి వృద్ధుడు
ఇటీవలే పాముకాటుకు గురైన తన మనవడితో పాటు అతడిని కాటేసిన సర్పాన్ని పట్టుకొని ఆస్పత్రికి తీసుకెళ్లాడు ఓ వృద్ధుడు. బిహార్​లో ఈ ఘటన జరిగింది. మనవడి ప్రాణాలు కాపాడేందుకు సాహసం చేసి మరీ పామును పట్టుకున్నాడు ఆ వృద్ధుడు. ఆస్పత్రికి పామును తీసుకురావడాన్ని చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

పాముతో ఆటలాడి!
ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా పాముతో ఆటలాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో సర్పాన్ని పట్టుకోగా పాము అతడిపై కాటు వేసింది. తన చేతిలో గరుడ రేఖ ఉందని చెబుతూ పాముతో ఆటలాడాడు ఆ వ్యక్తి. కాటేసిన తర్వాత పాము అతడి చేతిలో నుంచి జారిపోయింది. దీంతో పామును మళ్లీ పట్టుకున్నాడు. ఈ క్రమంలో నాలుగుసార్లు పాము కాటేసింది. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ లింక్​పై ఒక్క క్లిక్ చేయండి చాలు!

పాముకాటుకు విరుగుడు- ల్యాబ్​లో యాంటీబాడీల అభివృద్ధి- బెంగళూరు శాస్త్రవేత్తల ఘనత!

మందుకొట్టి పాముతో ఆట.. కాటేయగానే 'మృతి'.. అంత్యక్రియల వేళ లేచి కూర్చుని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.