ప్రతిధ్వని: ఈ ఏడాది స్టాక్‌మార్కెట్ల భవితవ్యం ఏవిధంగా ఉంటుంది?
కొత్త ఏడాదిలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. నిఫ్టీ 14 వేల పాయింట్లను దాటింది. దేశంలో కరోనా టీకాకు సంసిద్ధమవుతున్న నేపథ్యంలో.. కొత్త ఏడాదిలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయన్న అంచనాలతో సూచీలు సెంటిమెంట్‌ను పెంచాయి. 2020 సంవత్సరంలో కరోనా సంక్షోభంలోనూ ప్రామాణిక సూచీలు వృద్ధిని సాధించాయి. సెన్సెక్స్ 15 శాతం, నిఫ్టీ 14 శాతం దాకా పుంజుకున్నాయి. స్మాల్ క్యాప్ సూచీ 32 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 22 శాతం మేర వృద్ధిని సాధించాయి. ఈ నేపథ్యంలో గతేడాది స్టాక్ మార్కెట్లు పుంజుకున్న విధానం.. ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్ల భవితవ్యం ఏవిధంగా ఉంటుందనే అంశాలపై ప్రతిధ్వని చర్చ.