తెలంగాణ

telangana

BSP Leader RS Praveen kumar Interview

ETV Bharat / videos

అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సిర్పూర్​ను అగ్రస్థానంలో నిలబెడతా : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 6:33 AM IST

BSP Leader RS Praveen kumar Interview :ఈసారీఅసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్​వాది పార్టీ రెండంకెల సీట్లు సాధించబోతున్నామని.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. సిర్పూర్‌ నుంచి బరిలో నిలిచిన ఆయన.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నుంచి నియోజకవర్గానికి విముక్తి కల్పించడమే తన లక్ష్యమన్నారు. 

బీఆర్​ఎస్​ పాలనలో సిర్పూర్​ నియోజకరవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని దుయ్యబట్టారు. ఆంధ్రవలస పాలకుల మనస్తత్వం ఉన్న.. కోనేరు కోనప్ప వంటి నాయకుల చేతిలో నియోజకవర్గం నలిగి పోయిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ.. గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలవబోతోందన్నారు. సిర్పూర్​ నియోజకవర్గాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పట్టికలో మొదటి స్థానంలోనే కాకుండా.. అభివృద్ధిలోనూ మొదటి స్థానంలో నిలబెడతామన్నారు. తాము ఎన్నికల అనంతరం కీలక పాత్ర పోషిస్తామంటున్న ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌తో.. మా ప్రతినిధి ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details