A Strange Custom in Jagtial : గ్రామంలో వింత ఆచారం.. చీపుర్లు.. చాటలతో..
A Strange Custom in Jagtial District : దేశంలో అనేక ప్రాంతాల్లో అరుదైన ఆచారాలు, వైవిధ్యమైన సాంప్రదాయాలు పాటిస్తుంటారు. అదే రీతిలో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాత ధర్మరాజుపల్లి గ్రామంలో వింత ఆచారాన్ని గ్రామస్థులు పాటిస్తున్నారు. పాత ధర్మరాజుపల్లిలో ఊరికి పట్టిన కీడును (జెట్టక్కను) పొలిమేర వరకు దాటించేందుకు ప్రజలు చీపుర్లు.. చాటలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థులంతా కలిసి ఒకరినొకరు చీపుర్లతో కొట్టుకుంటూ గ్రామ పొలిమేర వరకు వెళ్లి అక్కడ వాటిని పారవేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది ఈ ఆచారాన్ని పాటిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు.
ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభంలో ఈ తంతు నిర్వహిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గ్రామం సుఖశాంతులతో, సిరి సంపదలతో సుభిక్షంగా ఉంటుందని.. పాడి పంటలు పండి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని గ్రామస్థుల నమ్మకం. అందుకే గ్రామస్థులు అంతా ఒక దగ్గరికి చేరుకొని చీపుర్లు, చాటలు పట్టుకుని జెట్టక్కను చీపుర్లు, చాటలతో కొడుతూ ఊరి చివరకు తీసుకెళ్లి చెట్టుకు ఉరి వేస్తారు. అనంతరం జెట్టక్కను కొట్టిన చీపుర్లు, చాటలు ఊరి బయట పారేసి వస్తారు. ఇలా చేయడం వల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని గ్రామస్థులు నమ్ముతున్నారు.