మారుతున్న జీవనశైలి, తీసుకున్న ఆహారం సహా వాతావరణ మార్పులతో ఎన్నో రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఉన్న రోగాలు మరింత తీవ్రంగా తయారై మానవ మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. అటువంటి వ్యాధుల్లో క్యాన్సర్ ప్రధానమైంది. ముఖ్యంగా మహిళలు రొమ్ము క్యాన్సర్కు(Breast Cancer) గురవుతున్నారు. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలు.. ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధిని ముందే గుర్తించడం ఎలా..? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు.
ముందే గుర్తించడం ఎలా?
- ప్రతf మహిళ నెలకొకసారి అద్దం ముందు నిల్చొని.. రొమ్ము వైపు చూసి, చేతులతో తాకి.. స్వయంగా పరీక్షించుకోవాలి. స్నానం చేస్తున్నప్పుడు, పడుకునే ముందు ఈ విధంగా పరీక్షించుకోవాలి.
- సొంతంగా రొమ్ములను పరీక్షించుకోవాలో తెలియకపోతే డాక్టర్ను సంప్రందిస్తే.. వాళ్లు నేర్పిస్తారు. లేదా యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. వాటిని చూసి నేర్చుకోవచ్చు!
- 45-65 ఏళ్ల మధ్య వయసువారు.. ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకు ఒకసారి మామోగ్రామ్(బ్రెస్ట్కు స్కాన్, ఎక్స్రే ) చేయించుకోవాలి.
- ఒబెసిటీ ఉన్నవాళ్లకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది.