తెలంగాణ

telangana

యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ.. తొలిసారిగా తిరుమల తరహాలో ఏర్పాట్లు

By

Published : Oct 8, 2022, 1:37 PM IST

Updated : Oct 8, 2022, 3:26 PM IST

Crowd at Yadadri temple: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దసరా సెలవులు కావడంతో యాదాద్రీషుడి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు వస్తున్నారు. కొండపైకి వెళ్లే బస్సులు పరిమిత సంఖ్యలోనే ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. పరిమితికి మించి భక్తులను బస్సులతో కొండపైకి తీసుకెళ్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు ఆలయ అధికారులు యాదాద్రిలో తొలిసారిగా తిరుమల తరహాలో భక్తులకు క్యూలైన్లు ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమయ్యారు.

Yadadri
Yadadri

యాదాద్రికి పెరిగిన భక్తుల రద్ధీ.. తొలిసారిగా తిరుమల తరహాలో ఏర్పాట్లు

Crowd at Yadadri temple: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాలు, ఘాట్‌ రోడ్డు వాహనాలతో పూర్తిగా రద్దీగా మారింది. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొండపైకి చేరవేసేందుకు ఉచిత బస్సులు ఉన్నప్పటికీ.. అవి సరిపోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిమితికి మించి భక్తులను బస్సుల్లో ఎక్కించుకుంటున్నారని మండిపడుతున్నారు.

తిరుమల తరహాలో ఏర్పాట్లు:మరోవైపు యాదాద్రి దర్శనం.. తిరుమల తరహాలో కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టారు. కొండపై ఉచిత దర్శన వరుసల కాంప్లెక్స్ నుంచి ఆలయ మాడ వీధి మీదుగా భక్తులను వరుస క్రమంలో తరలించే ప్రక్రియను చేపట్టారు. దర్శనానికి వేచి ఉండే భక్తులతో ఉచిత, ప్రత్యేక వరుసలు నిండిపోయి.. ఇక్కట్లు ఎదురవుతున్నాయి.

క్యూ కాంప్లెక్స్ నింపని పక్షంలో ఒకేసారి అధిక సంఖ్యలో భక్తులు ఆలయంలోకి వచ్చి చేరుతున్నారని ఆలయ అధికారులు తెలిపారు. క్యూలైన్లో నింపి.. కొద్ది కొద్ది మందిని వదలడం వల్ల దర్శనానికి వెసులుబాటు కలుగుతుందని.. సీఎం కేసీఆర్ సూచనలతో దర్శనం సులువుగా సాగేలా శ్రీకారం చుట్టినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 8, 2022, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details