తెలంగాణ

telangana

పార్టీని వీడిపోమంటూ ప్రమాణం చేసిన కాంగ్రెస్ కార్పొరేటర్లు

By

Published : May 4, 2021, 3:37 PM IST

హన్మకొండలోని కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో గెలిచిన నలుగురు కార్పొరేటర్లను ఆ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని.. నీతి, నిజాయతీతో గెలిచిన తమదే నైతిక విజయమని జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

wgl congress
Congress corporators, Greater Warangal elections, Hanmakonda

గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో గెలిచిన నలుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లను హన్మకొండలోని కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి.. పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని... వారితో పార్టీ మారబోమంటూ ప్రమాణం చేయించారు.

అభ్యర్థుల గెలుపును తారుమారు చేసేందుకు అధికారపక్షం అన్ని విధాల ప్రయత్నించిందని జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. నీతి, నిజాయతీతో గెలిచిన తమదే నైతిక విజయమన్నారు. నగర ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తామన్నారు.

ఇదీ చూడండి: ఈటల ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో అర్థం కావట్లేదు: కొప్పుల

ABOUT THE AUTHOR

...view details