తెలంగాణ

telangana

Corona: కరోనాతో తల్లీదండ్రులు మృతి.. అనాథలుగా మారిన చిన్నారులు

By

Published : Jun 6, 2021, 10:14 PM IST

కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. కొవిడ్​ కాటుకు కుటుంబాల్లో విషాదం నెలకొంటోంది. వైరస్​తో తల్లీదండ్రులు మృతి చెంది పిల్లలు అనాథలుగా మారిన ఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో భార్యాభర్తలు కరోనా సోకి చనిపోవటంతో వారి పిల్లలు అనాథలుగా మారారు.

Corona: కరోనాతో తల్లీదండ్రులు మృతి.. అనాథలుగా మారిన చిన్నారులు
Corona: కరోనాతో తల్లీదండ్రులు మృతి.. అనాథలుగా మారిన చిన్నారులు

సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరికి చెందిన ఆలకుంట్ల రమేశ్(42) వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పనులకు వెళ్తున్న క్రమంలో ఆయనకు కరోనా లక్షణాలు కనిపించటంతో మే 17న తుంగతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్ష చేయించుకోగా పాజిటివ్​ వచ్చింది. 18న సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.

పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మే 21న మృతి చెందారు. భార్య స్వరూప(38) మే 20న పరీక్ష చేయించుకోగా వైరస్​​ సోకినట్లు తెలిసింది. ఆమె కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెల 27న మృతి చెందింది. తల్లీదండ్రులు చనిపోవటంతో చిన్నారులు అనాథలుగా మారి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆపన్న అస్తం కోసం ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి:Telangana Cabinet: ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ABOUT THE AUTHOR

...view details