తెలంగాణ

telangana

lorry accident due to rain: వాగు దాటే క్రమంలో లారీ బోల్తా

By

Published : Sep 28, 2021, 3:08 PM IST

Updated : Sep 28, 2021, 3:19 PM IST

సూర్యాపేట జిల్లా బుగ్గ మాదారంలో లారీ బోల్తా(lorry accident due to rain) పడింది. వాగు దాటే క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.

lorry accident due to rain, suryapet lorry accident
వాగు దాటే క్రమంలో లారీ బోల్తా, బుగ్గ మాధారంలో లారీ బోల్తా

వాగు దాటే క్రమంలో లారీ బోల్తా(lorry accident due to rain) పడింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం బుగ్గ మాదారం వద్ద లోలెవల్‌ వంతెనపై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగు దాటేందుకు ప్రయత్నించగా.... దారి కనిపించకపోవడంతో వాగులో ఒకవైపునకు లారీ(lorry accident due to rain) ఒరిగింది. ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.

రాకపోకలకు ఇబ్బందులు

చిన్న వర్షం వచ్చినా వాగు పొంగిపొర్లుతోందని, రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి... ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాగులో పడిన లారీని బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు.

గులాబ్ పంజా

గులాబ్‌ తుపాను రాష్ట్రంలోని పలు జిల్లాలను వణికించింది. పలుచోట్ల చెరువులు నిండి రహదారులపైకి నీరు చేరడంతో... రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నీట మునిగిన కల్వర్టుల వద్ద పోలీసులు కాపలా ఉంచి ఎవరినీ వెళ్లకుండా నియంత్రిస్తున్నారు.

వాగు దాటే క్రమంలో లారీ బోల్తా

ఇదీ చదవండి:heavy rain in hyderabad: హైదరాబాద్- బెంగళూరు నేషనల్​ హైవేపైకి వరద.. ట్రాఫిక్ ఆంక్షలు!

Last Updated :Sep 28, 2021, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details