సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని లింగమయ్య కాలనీ, మంజీరా కాలనీ వాసులు ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న తమను ప్రభుత్వ భూములంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు.
'ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాం... ప్రభుత్వ భూమి అంటూ బెదిరిస్తున్నారు'
ఏన్నో ఏళ్లుగా నివాసముంటున్న తమని ప్రభుత్వ భూములంటూ కొందరు బెదిరిస్తున్నారని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కాలనీ వాసులు వాపోయారు. ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులు అమీన్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
'ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాం... ప్రభుత్వ భూమి అంటూ బెదిరిస్తున్నారు'
ఇళ్లలో ఎవరూ లేని సమయంలో వచ్చి పిల్లలకు నోటీసులు అందజేస్తున్నారని ఆరోపించారు. స్థానికులందరూ ర్యాలీగా వెళ్లి అమీన్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:ఇంధన ధర పెంపునకు నిరసనగా భట్టి సైకిల్ యాత్ర