నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోదరుడు సురేందర్ రెడ్డి భోజనం అందించారు. మహమ్మారి కట్టడికి పారిశుద్ధ్య కార్మికుల ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తూ ఫ్రంట్లైన్ వారియర్ మహమ్మారిపై పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.
కొవిడ్ కట్టడిలో వారి పాత్ర కీలకమైనది: ఇంద్రకరణ్ రెడ్డి
కొవిడ్ కట్టడిలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమైందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సోదరుడు అల్లోల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు భోజనం అందించారు.
నిర్మల్ వార్తలు
వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, పోలీసులు, ఇతర ఫ్రంట్లైన్ వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో వారి చేస్తున్న సేవలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. కార్యక్రమంలో డెయిరీ ఛైర్మన్ లోక భూమా రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కౌన్సిలర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:Palamooru Mango: పాలమూరు మామిడికి మహర్దశ