తెలంగాణ

telangana

గద్దెలపై కంకవనం..సాయంత్రం సమ్మక్క దర్శనం..

By

Published : Feb 6, 2020, 11:26 AM IST

మేడారం జాతరలో ఈరోజు సాయంత్రం సమ్మక్క గద్దెలకు చేరుకోనుంది. ఈరోజు ఉదయం పూజారులు అడవి నుంచి కంక వనాన్ని డప్పు వాయిద్యాలతో తీసుకొచ్చి సమ్మక్క గద్దపై ప్రతిష్టించారు. సాయంత్రానికి అమ్మవారు గద్దెలపైకి రానుంది.

Sammakka found under the concave and medaram jatara mulugu
కంకవనం కింద దొరికిన సమ్మక్క

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ రోజు సాయంత్రం మహాఘట్టం ఆవిష్కృతం కానుంది. సమ్మక్క గద్దెలపైకి చేరుకోనుంది. అడవిలో కంకవనం కింద సమ్మక్క దొరికిందని చరిత్ర చెబుతోంది.

ముందుగా ఈరోజు ఉదయం పూజారులు అడవి నుంచి కంక వనాన్ని గిరిజన సంప్రదాయంగా డప్పు వాయిద్యాలతో తీసుకొచ్చి సమ్మక్క గద్దపై ప్రతిష్టించారు. సాయంత్రానికి సమ్మక్క గద్దెల వద్దకు చేరుకోనుంది.

కంకవనం కింద దొరికిన సమ్మక్క

ఇదీ చూడండి :మేడారంలో ఆ జెండా చూస్తూ నడవాల్సిందే..

ABOUT THE AUTHOR

...view details