కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని కాపువాడ గణేష్ మండలి ఆధ్వర్యంలో దాదాపు 21 వేల చింతగింజలతో 8 ఆడుగుల గణపతి ప్రతిమను ప్రతిష్ఠించారు. గతేడాది రంగురంగుల పూలతో వినాయకున్ని తయారు చేసిన యువకులు ఈ ఏడు చింతగింజలతో రూపొందించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేసినట్లు తెలిపారు. సంజీవయ్య కాలనీ శివపుత్ర గణేష్ మండలి సభ్యులు... 20 కిలోల కొబ్బరితాడుతో దాదాపు అడుగుల గణనాథున్ని తయారు చేశారు. గత ఏడాది జాకెట్ పీసులతో తయారుచేసిన మండలి సభ్యులు ఈ ఏడాది వినూత్నంగా... కొబ్బరి తాడుతో రూపొందించారు. ద్వారకానగర్ ఆరాధన గణేష్ మండలి సభ్యులు ఖర్జూరంతో గణేషున్ని రూపొందించారు. వినూత్నంగా తయారైన ఖర్జూరపు వినాయకుడు పలువుర్ని ఆకర్షిస్తున్నాడు.
నాణేలు, నారింజలు, కాగితాలు... గణేశుడికి కాదేదీ అనర్హం!
నాణేలు, నారింజలు, కాగితాలు, కొబ్బరికాయలు కాదేది విఘ్నేష ప్రతిమకు అనర్హం అంటున్నారు గణేష్ మండల సభ్యులు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని వివిధ కాలనీల్లో వినూత్నంగా తయారు చేసిన గణపతులు కొలువుదీరాయి. కొబ్బరితాడు, చింతగింజలు, ఖర్జురాలతో చేసిన వినాయక ప్రతిమలు స్థానికులను ఆకర్షిస్తున్నాయి.
Innovative Ganesh statues ...