తెలంగాణ

telangana

'పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా రెండు పడక గదుల ఇళ్లు'

By

Published : Jan 5, 2021, 4:10 PM IST

పేదలకు అన్ని వసతులతో కూడిన ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్​ రెండు పడక గదుల ఇళ్లకు శ్రీకారం చుట్టారని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ అన్నారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు.

'పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా రెండు పడక గదుల ఇళ్లు'
'పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా రెండు పడక గదుల ఇళ్లు'

పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చిరస్థాయిగా నిలుస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట, రెడ్డిగూడెం గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లు, పల్లె ప్రకృతి వనంను ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు మంజూరు చేశాయని... వీటి ద్వారా లబ్ధిదారులపై ఎక్కువ భారం మోపే వారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు అన్ని వసతులతో ఇల్లు ఉండాలనే లక్ష్యంతో రెండు పడక గదుల ఇళ్లకు శ్రీకారం చుట్టారన్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు లబ్ధిదారులకు విద్యుత్, తాగునీరు కూడా కల్పించే విధంగా రూపకల్పన చేశారన్నారు. గత ప్రభుత్వాలు నిర్మాణం చేపట్టిన పథకాల్లో అనేక అవకతవకలు ఉండేవని, ప్రస్తుతం వాటికి స్వస్తి చెప్పి ప్రభుత్వమే నిర్మాణం చేపట్టి పేదలకు పంపిణీ చేస్తోందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో అన్ని వసతులు కల్పిస్తోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రూపురేఖలు మార్చారని ఎంపీ నామ నాగేశ్వరరావు కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన పథకాలను ప్రవేశపెడుతూ భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని ముందంజలో నిలిపారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 50వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం: హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details