పేదవాడి ఆకలి తీర్చే 'అన్నపూర్ణ' ఇప్పుడు ఖమ్మంలో...
పేదవాడి ఆకలి తీర్చే అన్నపూర్ణ క్యాంటీన్‌ను ఇప్పడు ఖమ్మంలోని తెలంగాణ తల్లి కూడలి వద్ద ప్రారంభించారు. ఈ క్యాంటీన్ వల్ల రోజుకు సుమారు వెయ్యి మంది పేదవాళ్ల ఆకలి తీర్చగలుగుతామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వివరించారు.
పేదవాడి ఆకలి తీర్చే 'అన్నపూర్ణ' ఇప్పుడు ఖమ్మంలో...
ఖమ్మంలో రోజుకు వెయ్యి మంది పేదలకు 5 రూపాయల భోజనం అందించేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ తల్లి కూడలి వద్ద అన్నపూర్ణ భోజనం క్యాంటీన్ ప్రారంభించారు. నగరంలో మరో మూడు ప్రాంతాల్లో అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మేయర్ డాక్టర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర కమిషనర్ అనురాగ్ తదితరులు పాల్గొన్నారు.