తెలంగాణ

telangana

ఖమ్మం పట్టణంలో వామపక్షపార్టీల ఆధ్వర్యంలో నిరసన

By

Published : Aug 7, 2020, 1:30 PM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మంలో నిరసన తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తగినన్ని ఏర్పాట్లు చేయాలని డిమాండ్​ చేశారు.

ఖమ్మం పట్టణంలో వామపక్షపార్టీల ఆధ్వర్యంలో నిరసన
ఖమ్మం పట్టణంలో వామపక్షపార్టీల ఆధ్వర్యంలో నిరసన

ఖమ్మం పట్టణంలోని ఆర్​అండ్​బీ అతిథి గృహం ఎదుట వామపక్ష నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసనలో భాగంగా నల్ల బెలూన్లు ఎగరేశారు. ఖమ్మం జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు.

కరోనా కట్టడిలో అధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. టెస్టుల సంఖ్య పెంచి కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీచూడండి:భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details