తెలంగాణ

telangana

Mother in law beat Pregnant Woman : అబార్షన్​ చేసుకుంటోందంటూ.. యువతిని చిదకబాదిన అత్తమామలు

By

Published : Jun 13, 2023, 6:01 PM IST

Mother-in-law and pregnant woman fights Karimnagar :తమ అనుమతి లేకుండా అబార్షన్​ చేసుకునేందుకు ప్రైవేట్​ ఆసుపత్రికి వెళ్లిందనే సమాచారంతో.. ఆ అత్తామామ.. కోడలిని, ఆమె తల్లిని, వైద్యురాలిని చిదకబాదారు. కరీంనగర్​లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Etv Bharat
Etv Bharat

అబార్షన్​ చేసుకుంటోందంటూ.. యువతిని చిదకబాదిన అత్తమామలు

Mother in law beat the pregnant woman for abortion in Karimnagar : భార్యాభర్తల అంగీకారంతో 6వారాల లోపు అబార్షన్​ చేసేందుకు వైద్యులు అంగీకరిస్తారు. దానికి తగిన కారణాలను తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ఇరువురి అనుమతి లేకుండా అబార్షన్​ చేయడం నేరం. ఓ మహిళ అబార్షన్​ చేసేందుకు ఆసుపత్రికి వెళ్లిదని అత్తమామలు అభిప్రాయపడ్డారు. దీంతో వారు ఆసుపత్రికి చేరుకొని.. మహిళను, ఆమె తల్లిని, డాక్టర్​లను కొట్టారు. కాసేపు వారి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కరీంనగర్​ జిల్లాలో జరిగింది.

Mother in law and pregnant woman fight in hospital : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్​లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తమ కోడలికి అబార్షన్ చేస్తున్నారన్న సమాచారంతో అత్తమామలు ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డారు. తమ కోడలితో పాటు ఆసుపత్రికి తీసుకొచ్చిన మధ్యవర్తి ఆర్​ఎంపీపై దాడి చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజరుపల్లి గ్రామానికి చెందిన గర్భిణీ అబార్షన్ కోసం కరీంనగర్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించారని సమాచారం. ఈ క్రమంలో ఆస్పత్రి వైద్యులు గర్భిణీకు అబార్షన్ చేస్తున్నారనే సమాచారం మేరకు మహిళ అత్తమామలు ఆసుపత్రిపై దాడికి దిగారు.

Mother in law not agree to abortion in Peddapalli : తాము వద్దంటున్నా తమ కోడలు బలవంతంగా అబార్షన్​కి సిద్ధమైందని.. అత్తమామలు ఆగ్రహంతో ఆస్పత్రిపై దాడి చేశారు. మహిళతో పాటు ఆమె తల్లి, మహిళ వైద్యురాలిని చితకబాదారు. మరోవైపు బాధితురాలు మాత్రం తనకు రక్తస్రావం జరుగుతోందని వైద్యం కోసం వచ్చామని.. అత్తమామలు అనవసరంగా దాడికి పాల్పడుతున్నారని పేర్కొంది. ఆమెకి అబార్షన్ చేయలేదని.. కేవలం వైద్యం మాత్రమే చేయిస్తున్నామని వైద్యులు చెప్పినప్పటికీ వారు అంగీకరించలేదు. గతంలోనే వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లినా.. ఇచ్చిన మందులు వాడకుండా అబార్షన్ కోసం వచ్చిందని అత్తమామలు ఆరోపించారు. స్థానికులు ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు.

Aunt quarrele daughter in law : గొడవ పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక అసలు నిజం ఏమిటో అని విచారణ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అబార్షన్​ చేసుకునేందుకు కారణాలు ఏమిటి? ఆమె ఎందుకు అబార్షన్​ చేసుకోవాల్సి వచ్చింది? దానికి ఆమె తల్లి ఎందుకు సాయం చేస్తోంది? అత్తమామలు గొడవ పడేలా పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి? తదితర విధాలుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details