తెలంగాణ

telangana

కోతకు గురైన మేడిగడ్డ బ్యారేజీ గ్రావిటీ కాలువ, కరకట్ట.. 100 మీటర్ల మేర!

By

Published : Jul 19, 2022, 3:29 PM IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ఈ క్రమంలోనే మేడిగడ్డ బ్యారేజీ గ్రావిటీ కాలువ, కరకట్ట కోతకు గురయ్యాయి. సుమారు 100 మీటర్ల మేర కోతకు గురికాగా.. ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడంతో దర్శనమిస్తున్నాయి.

కోతకు గురైన మేడిగడ్డ బ్యారేజీ గ్రావిటీ కాలువ, కరకట్ట.. 100 మీటర్ల మేర!
కోతకు గురైన మేడిగడ్డ బ్యారేజీ గ్రావిటీ కాలువ, కరకట్ట.. 100 మీటర్ల మేర!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ గ్రావిటీ కాలువ, కరకట్ట కోతకు గురయ్యాయి. మేడిగడ్డ పంప్​హౌస్​ నుంచి జలాలను తరలించే గ్రావిటీ కాలువ పలుచోట్ల కోతకు గురైంది. వరద నీరు తగ్గడంతో కోతకు గురైన ప్రాంతాలు ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి.

బ్యారేజీలో నీటి నిల్వ చేపడితే బ్యాక్​ వాటర్​ వల్ల గ్రామాలు ముంపునకు గురి కాకుండా ఉండేందుకు అంబట్​పల్లి, సూరారం, బెగ్లూర్ గ్రామాల వరకు కరకట్టను నిర్మించారు. గోదావరి వరద మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతంతో పాటు ఈ గ్రామాలనూ ముంచెత్తింది. వరద తగ్గడంతో బెగళూర్, బొమ్మాపూర్ శివారు ప్రాంతాల్లో సుమారు 100 మీటర్ల మేర కరకట్ట కోతకు గురై.. బండరాళ్లు కొట్టుకుపోయాయి. అలాగే గ్రావిటీ కాలువ మార్గంలోనూ కోతలు ఏర్పడ్డాయి.

కోతకు గురైన మేడిగడ్డ బ్యారేజీ గ్రావిటీ కాలువ, కరకట్ట.. 100 మీటర్ల మేర!

ABOUT THE AUTHOR

...view details