ఎగ్జిబిషన్ సొసైటీలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందని అనిశా డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. సొసైటీ కార్యాలయంలో నిన్నటి నుంచి విచారణ చేస్తున్నామని చెప్పారు. సొసైటీ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. సొసైటీ కాలేజ్ మేనేజ్‌మెంట్, సభ్యుల నియామకంపై విచారిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 7 అంశాల వివరాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మొత్తం మూడు సొసైటీలు ఉన్నాయని, ఆర్థిక, ఉస్మానియా గ్రాడ్యుయేట్, ఎగ్జిబిషన్ సొసైటీ వివరాలు వెరిఫై చేస్తున్నామన్నారు. గత ఆరేళ్లుగా జరిగిన వివరాలపై ఆరా తీస్తున్నామని శ్రీకాంత్ చెప్పారు.
ఎగ్జిబిషన్ సొసైటీలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు: అనిశా డీఎస్పీ
21:32 July 02
ఎగ్జిబిషన్ సొసైటీలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు: అనిశా డీఎస్పీ
కార్యదర్శి స్పందన
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో అనిశా తనిఖీలపై.. కార్యదర్శి స్పందించారు. తమ సొసైటీలో ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. సొసైటీ కార్యకలాపాలు పారదర్శకంగా జరుగుతున్నాయని.. తొలిసారి అనిశా సోదాలు జరిగినట్లు చెప్పారు. రికార్డులు అనిశా అధికారులకు చూపించినట్లు తెలిపారు. ఖాతాలన్నీ ఏటా ఆడిట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. సొసైటీ సమావేశాలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎన్నడూ హాజరుకాలేదని కార్యదర్శి వెల్లడించారు. అవినీతి, నిధుల గోల్‌మాల్ ఆరోపణలపై ఏసీబీ అధికారుల సోదాలు పూర్తయితే మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:TS-AP WATER WAR: 'ఆ రెండు ప్రాజెక్టుల్లో నిరంతరంగా జల విద్యుత్ ఉత్పత్తి'