తెలంగాణ

telangana

కుట్రలు చేసి బీజేపీని అణచి వేయాలనేది కేసీఆర్ యోచన: కిషన్‌రెడ్డి

By

Published : Apr 7, 2023, 4:23 PM IST

Bjp Leaders fires on BRS : ప్రధాని పర్యటన వేళ రాష్ట్రంలో బీఆర్​ఎస్–బీజేపీల మధ్య మాటల యుద్ధం నెలకొంది. బంగారు తెలంగాణ పక్కనపెట్టి.. బంగారు కుటుంబం నిర్మించుకున్నారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు. కుట్రలు చేసి బీజేపీని అణచి వేయాలనేది కేసీఆర్ యోచన అని ధ్వజమెత్తారు. నోటీసులు, జైళ్లకు భయపడేది లేదని ఈటల రాజేందర్​ అన్నారు.

kishanreddy
kishanreddy

Bjp Leaders fires on BRS : శనివారం ప్రధాని మోదీ రాక సందర్భంగా కేంద్రం తీరును నిరసిస్తూ బీఆర్​ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అధికార పార్టీ ఆందోళనలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్​రెడ్డి నేతృత్వంలో ఈ కోర్ కమిటీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా రేపటి ప్రధాని సభ, బండి సంజయ్ అరెస్టు, బెయిల్, ప్రసుత్త రాజకీయ పరిణామాలపై బీజేపీ నేతలు చర్చలు జరిపారు. ఈ భేటీలో బీఆర్​ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు.

బంగారు తెలంగాణ పక్కనపెట్టి.. బంగారు కుటుంబం నిర్మించుకున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్‌ నవ్వులపాలు చేశారని ఆరోపించారు. కుటుంబ పార్టీలకు నాయకత్వం వహిస్తానని చెప్పడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. 9 ఏళ్లలో ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదన్న కిషన్​రెడ్డి.. కేసీఆర్ మాత్రం 9 ఏళ్లలో ఒక్కసారి కూడా సచివాలయానికి రాలేదని విమర్శించారు. కుట్రలు చేసి బీజేపీని అణచివేయాలనేది కేసీఆర్ యోచన అని మండిపడ్డారు.

'టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీలో లక్షలాది విద్యార్థలు రోడ్డున పడ్డారు. ప్రశ్నపత్రాల లీకేజీని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు మోదీ వస్తున్నారు. హైదరాబాద్‌లో కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్ల ఎంఎంటీఎస్‌ పెండింగ్‌లో ఉంది. 9 ఏళ్లుగా సచివాలయానికి రాని సీఎం కేసీఆర్ ఒక్కరే. ఎలాంటి తెలంగాణ కోసం పోరాటం చేశామో ప్రజలు గ్రహించాలి. తమ ప్రభుత్వంపై ఎవరూ మాట్లాడవద్దని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణ వ్యతిరేకులు అందరూ ప్రగతి భవన్‌లో జమయ్యారు.'-కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

పోలీసులను నమ్ముకున్నోళ్లు బాగుపడరు : తనను వేధించేందుకే నోటీసులు ఇచ్చారని.. నోటీసులు, జైళ్లకు భయపడమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సంబంధం లేకపోయిప్పటికీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి... నోటీసులపై వివరణ ఇస్తానని వెల్లడించారు. ఎవరో ఒక వ్యక్తి వాట్సప్ చేస్తే.. అదీ చూడకపోయినా తనకు నోటీసులు ఇచ్చారన్నారు. టెక్నాలజీకి తానింక అప్డేట్ కాలేదని.. మెసేజ్​లకు రిప్లై ఇవ్వనని చెప్పారు. పోలీసులను నమ్ముకున్నోళ్లు బాగుపడరని.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఈటల ఎద్దేవా చేశారు.

90 శాతం పనులు ప్రైవేటు కార్మికులకు అప్పగిస్తున్నారు : సింగరేణి ఎందుకు రూ.10 వేల కోట్ల అప్పుల పాలైందని ఈటల రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ వచ్చే నాటికి 63 వేల మంది ఉద్యోగులతో కళకళలాడిన సింగరేణి.. ఇప్పుడు 43 వేల మంది ఉద్యోగులకు ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. 90 శాతం పనులు ప్రైవేటు కార్మికులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. కోల్ ఇండియాలో ఒక్కో కార్మికుడికి రూ.9 వందలకు పైగా ఇస్తుంటే.. సింగరేణి కార్మికుడిని రూ.430 మాత్రమే ఇస్తున్నారన్నారు. సింగరేణి కంపెనీని ఏఎంఆర్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని.. దాని వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని ఈటల రాజేందర్​ పేర్కొన్నారు.

'సింగరేణి విషయంలో ప్రజలను బీఆర్​ఎస్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. సింగరేణిపై బహిరంగ చర్చకు సిద్ధమని చాలాసార్లు సవాల్ చేశా. నా సవాల్‌కు బీఆర్​ఎస్ నేతలు ఒక్కరు కూడా స్పందించలేదు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు. సింగరేణిలో మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సింగరేణి ప్రైవేటీకరణ ఎలా సాధ్యం? 2017లో వచ్చిన కొత్త చట్టానికి బీఆర్​ఎస్ మద్దతిచ్చింది.' - ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details