తెలంగాణ

telangana

Holidays for Educational Institutes: విద్యాసంస్థలకు సెలవులు... ఉత్తర్వులు జారీ

By

Published : Jan 4, 2022, 8:09 PM IST

Holidays for Educational Institutes: రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈనెల 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఇవాళ జారీ చేసింది.

Holidays
Holidays

Holidays for Educational Institutes: రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈనెల 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది. కరోనా వైరస్ కేసుల పెరుగుదల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు సెలవులు ప్రకటించారు. వైద్యకళాశాలలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

కేసీఆర్ సమీక్ష...

Cm Kcr Review: దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్... సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఈనెల 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంక్రాంతి పండగ కోసం పాఠశాలలు, కొన్ని విద్యాసంస్థలకు ఈనెల 11 నుంచి సెలవులు ప్రకటించారు. మరికొన్ని విద్యాసంస్థలు మూడు, నాలుగు రోజుల సెలవులు ప్రకటించాయి. కొవిడ్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని అన్ని విద్యాసంస్థలకు ఎనిమిదో తేదీ నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details