తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు... న్యాయవాది శ్రీనివాస్‌కు మరోసారి సిట్‌ నోటీసులు

MLAs Poaching Case Updates: ఎమ్మెల్యేలకు ఎర కేసులో న్యాయవాది శ్రీనివాస్‌కు సిట్‌ మరోసారి నోటీసులు ఇచ్చింది. నందు, సింహయాజితో కలిసి ప్రయాణించిన వివరాలు చెప్పాలని పేర్కొంది. అదే విధంగా శ్రీనివాస్, ఆయన భార్య బ్యాంకుల ఖాతాల వివరాలు, పాస్‌పోర్టు ఇవ్వాలని తెలిపింది.

trs mlas poaching case updates
trs mlas poaching case updates

By

Published : Nov 24, 2022, 7:24 PM IST

MLAs Poaching Case Updates: ఎమ్మెల్యేలకు ఎర కేసులో న్యాయవాది శ్రీనివాస్‌కు సిట్‌ మరోసారి నోటీసులు జారీ చేసింది. నందు, సింహయాజితో కలిసి ప్రయాణించిన వివరాలు చెప్పాలని నోటీసులో పేర్కొంది. నందు వద్ద రూ.55 లక్షలు అప్పు తీసుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారన్న సిట్‌.. అందుకు నందుకు నెలకు రూ.1.10లక్షలు వడ్డీ చెల్లిస్తున్నట్లు చెప్పారని తెలిపింది. ఈ క్రమంలోనే వడ్డీ చెల్లిస్తున్న గూగుల్ పే, ఫోన్ పే వివరాలు సమర్పించాలని శ్రీనివాస్​ను ఆదేశించింది.

ఎక్కడికి వెళ్లినా నందూనే టికెట్లు బుక్ చేస్తారని శ్రీనివాస్ తెలిపారన్న సిట్.. నందకుమార్ బుక్ చేసిన విమాన టికెట్ల వివరాలు ఇవ్వాలని పేర్కొంది. విచారణకు వచ్చేటపుడు ఈ వివరాలు తీసుకురావాలని నోటీసులో పేర్కొంది. రేపు సిట్‌ విచారణకు హాజరుకావాలని శ్రీనివాస్‌ను హైకోర్టు ఆదేశించింది.ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈ నెల 21, 22న సిట్ విచారణకు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ నెల 21న తన ఫోన్‌ను సిట్ అధికారులకు అప్పగించారు.

జులై వరకు వాడిన మరో ఫోన్ అప్పగించాలని శ్రీనివాస్‌కు సిట్ స్పష్టం చేసింది. పాత ఫోన్ పగిలినందున జూన్ 1న కొత్తది కొన్నట్లు ఆయన తెలిపారు. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసినట్లు చెప్పారు. సిట్‌కు అప్పగించిన మొబైల్‌లోనే ట్రావెల్ ఏజెన్సీ వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా శ్రీనివాస్, ఆయన భార్య బ్యాంకుల ఖాతాల వివరాలు, పాస్‌పోర్టు ఇవ్వాలని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details