హైదరాబాద్ సైదాబాద్‌లో బాలికపై అఘాయిత్యం, హత్యపై ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం శోచనీయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె చిన్నారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని సీతక్క వ్యాఖ్యానించారు.
ఘటనపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు. గణేశ్ చరుత్థి రోజున నగరం నడిబొడ్డున దారుణం జరిగింది. కానీ ఇప్పటివరకు సీఎం, కేటీఆర్ స్పందించకపోవడం ఏంటి?. నిందితుడికి గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు సమాచారముంది. అతనిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. గిరిజన బిడ్డకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించలేదు. కనీసం గిరిజన ఎమ్మెల్యేలు కూడా స్పందించలేదు. కలెక్టర్‌ను పంపి చేతులు దులుపుకున్నారు.
-ఎమ్మెల్యే సీతక్క