తెలంగాణ

telangana

బెల్టు షాపులను కట్టడి చేయాలి: ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

By

Published : Mar 26, 2021, 7:25 PM IST

గ్రామాలలోని బెల్టు షాపులను కట్టడి చేయాలని, వాటి వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని మండలిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 20నెలల పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులు కోల్పోయారని అన్నారు.

mlc jeevan reddy
ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

మండలిలో బడ్జెట్‌ పద్దులపై జరిగిన చర్చలో అన్ని పార్టీలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. గ్రామాల్లోని బెల్టు షాపులను కట్టడి చేయాలని, వాటి వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని మండలిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 20 నెలల పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులు కోల్పోయారని అన్నారు. బీసీ సబ్‌ ప్లాన్‌ ఎప్పుడు తెస్తారని, వక్ఫ్​ బో​ర్డుకు జ్యుడిషియల్‌ అధికారాలు ఎప్పుడు కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. అసైన్డ్‌ భూమి హక్కుదారుడు చనిపోతే.. ఆ భూమి ఆ కుటుంబ సభ్యులకు దక్కడం లేదన్నారు.

ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

భాజపా ఎమ్మెల్సీ రామ్‌చందర్‌ రావు తన పదవి ముగియటంతో.. ఆరేళ్లపాటు తనకు సహకరించిన సహచర సభ్యులకు, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని విద్యాహబ్‌గా మార్చాలని, గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌ కల్పించాలని కోరారు.

రామ్‌చందర్‌ రావు

ఇదీ చదవండి:కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుంది: డీకే అరుణ

ABOUT THE AUTHOR

...view details