తెలంగాణ

telangana

ETV Bharat / state

Medicine From Sky: డ్రోన్ పేలోడ్​తో మెడిసిన్స్ ఫ్రమ్ స్కై మరింత సులభతం

డ్రోన్ పేలోడ్ సాంకేతికతతో మెడిసిన్స్ ఫ్రమ్ స్కై (Medicine From Sky) ప్రాజెక్టు మరింత సులభతరం కానుంది. ఈ డ్రోన్ పేలోడ్​ను టీవర్క్స్ అభివృద్ధి చేసింది. దీని ద్వారా మందుల సరఫరా మరింత సులభతరం కానుంది.

Medicine From Sky
మెడిసిన్స్ ఫ్రమ్ స్కై

By

Published : Oct 6, 2021, 8:44 PM IST

మెడిసిన్స్ ఫ్రమ్ స్కై ప్రాజెక్టు(Medicine From Sky)ను మరింత సులభతరం చేసే డ్రోన్ పేలోడ్ సాంకేతికతను టీవర్క్స్ అభివృద్ధి చేసింది. తద్వారా శీతలీకరణ చేయబడిన బాక్స్​లో మందుల సరఫరా మరింత సులభతరం కానుందని టీవర్క్స్ తెలిపింది. హైదరాబాద్​కు చెందిన ఎయిర్ సర్వ్ ఇన్షియేటివ్స్- టీవర్క్స్ ఆధ్వర్యంలో డ్రోన్​ను విజయవంతంగా పరీక్షించాయి. ఈ సాంకేతికత మానవ ప్రమేయాన్ని మరింత తగ్గిస్తుందని.. డ్రోన్ ల్యాండ్ అయిన వెంటనే పేలోడ్​ను ఆటోమేటిక్​గా విడుదల చేస్తుందని టీవర్క్స్ పేర్కొంది.

టీవర్క్స్ అభివృద్ధి చేసిన డ్రోన్ పేలోడ్

డ్రోన్ లక్షిత ప్రదేశానికి చేరుకున్న ఒక్క సెకనులో పేలోడ్ వేరుపడుతుందని.. ఆ వెంటనే డ్రోన్ తన హోం బేస్​కు ఎగిరిపోతుందని రూపకర్తలు తెలిపారు. ఎయిర్ సర్వ్ స్టార్టప్ ఈ మెడికల్ డ్రోన్​ను వికారాబాద్ ఏరియా ఆసుపత్రి నుంచి మాడుగుల చిట్టంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విజయవంతంగా మందులను చేరవేసింది. 6.2 కిలోమీటర్ల దూరాన్ని డ్రోన్ సహాయంతో సునాయాసంగా మందుల సరఫరా జరిగిందని.. ల్యాబ్ టూ మార్కెట్ ఇన్నోవేషన్​కు ఇదొక చక్కని ఉదాహరణ అని టీవర్క్స్ సీఈవో సుజయ్ కారంపూరి (T-Works Ceo Sujay Karampuri)అన్నారు.

మెడిసిన్స్ ఫ్రమ్ స్కై

తొలిసారిగా తెలంగాణలో...

రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసే.... మెడిసిన్ ఫ్రం స్కై (MEDICINE FROM SKY) ప్రాజెక్టు వికారాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. వికారాబాద్​లోని పోలీస్ పరేడ్ మైదానం(VIKARABAD POLICE PARADE GROUND) లో.. నెలరోజులపాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రయోగాత్మక పరిశీలన చేస్తున్నారు. కేంద్ర విమానయానశాఖ(Ministry of Civil Aviation)మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, మంత్రులు కేటీఆర్(KTR), సబితాఇంద్రారెడ్డి(SABITHA INDRAREDDY) లాంఛనంగా ప్రారంభించారు.

రవాణా కోసమే...

డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు ఔషధాలు రవాణా చేయడం కోసమే ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో ఔషధాలు, టీకాలను వేగంగా చేరవేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సుమారు 40 కిలోమీటర్ల వరకు డ్రోన్ ప్రయాణిస్తుంది. ఒక్క డ్రోన్​లో 15 రకాల ఔషధాలు, టీకాల సరఫరాకు అవకాశం ఉంటుంది. నాణ్యత దెబ్బతినకుండా డ్రోన్​లో 4 వేర్వేరు బాక్సుల్లో మందులు సరఫరా చేస్తారు. భూమికి 500-700 మీటర్ల ఎత్తులో ఇది ప్రయాణిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details