తెలంగాణ

telangana

పారిశుద్ధ్య కార్మికులకు పౌష్టికాహారం పంపిణీ

By

Published : May 17, 2020, 12:30 PM IST

హైదరాబాద్​ సీతాఫల్​మండి డివిజన్​కు చెందిన జీహెచ్​ఎంసీ కార్మికులకు గుడ్లు పంపిణీ చేశారు. ఒక్కో కార్మికునికి 30 చొప్పున 5000 గుడ్లు అందించారు. ప్రతీ ఒక్కరు లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని నాయకులు తెలిపారు.

eggs distributed to municipal employees in seethafalmandi
పారిశుద్ధ్య కార్మికులకు పౌష్టికాహారం పంపిణీ

ఉప సభాపతి పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు కార్మికులకు సుంకు ఫౌడేషన్​ ఆధ్వర్యంలో పౌష్టికాహారమైన గుడ్లు పంపిణీ చేశారు. హైదరాబాద్​ సీతాఫల్​మండి డివిజన్​కు చెందిన జీహెచ్​ఎంసీ కార్మికులకు సుమారు 150 మందికి పౌష్టికాహారమైన గుడ్లు పంపిణీ చేశారు. ఒక్కో కార్మికునికి 30 చొప్పున 5000 గుడ్లు అందించారు.

కార్యక్రమంలో కార్పొరేటర్​ సామల హేమ, ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు సుంకు రాంచందర్​ పాల్గొన్నారు. లాక్​డౌన్​తో నిమిత్తం లేకుండా ప్రజలు మున్ముందు రోజుల్లో కూడా పలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని కార్పొరేటర్​ హేమ తెలిపారు. భౌతికదూరం, వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కుల ధారణ వంటి జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ఇదీ చదవండి:శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట

ABOUT THE AUTHOR

...view details