తెలంగాణ

telangana

Appreciation: మహిళా కానిస్టేబుల్ కు సీపీ అభినందన

By

Published : May 28, 2021, 7:52 PM IST

రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతూ గుండె వ్యాధితో బాధపడుతున్న రోగికి రక్తదానం చేసింది. ఈ విషయం తెలుసుకున్న సీపీ మహేశ్ భగవత్ ఆమెను అభినందించారు.

cp
cp

కరోనా కష్టకాలంలో పోలీసులు లాక్‌డౌన్‌ను (Lockdown) కఠినంగా అమలు చేస్తూనే మేమున్నామంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి అనాథలు, వృద్ధులు, లారీ, ట్రక్కు డైవర్లకు భోజనాలు సరఫరా చేస్తున్నారు. తాజాగా రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతూ గుండె వ్యాధితో బాధపడుతున్న రోగికి రక్తదానం చేసింది.

గుండె వ్యాధితో చికిత్స పొందుతున్న మహిళ రక్తం గ్రూపు బి పాజిటివ్‌ కావడం... అత్యవసరంగా రక్తం కావాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ స్వప్న తనది కూడా అదే గ్రూపు అని ముందుకు వచ్చి రక్తందానం చేసింది. కానిస్టేబుల్‌ను రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ (Cp mahesh bhagavat) అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details