Congress Leaders on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ దవాఖానాలు సందర్శించి బాగున్నట్లు ప్రశంసించారని.. హైదరాబాద్‌లో ఉన్న ఆసుపత్రులను ఎందుకు సందర్శించరని కాంగ్రెస్ నేతలు నిలదీశారు. సీఎం కేసీఆర్‌కు ఆరోగ్య సమస్య తలెత్తితే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తాడు తప్ప ప్రభుత్వాసుపత్రికి ఎందుకు వెళ్లరని మాజీ మంత్రి గీతారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత లోపించిందని నేతలు ఆరోపించారు. టిమ్స్ ఆసుపత్రికి కరోనా సమయంలో కోట్లు ఖర్చు పెట్టి నేడు మూసివేయడం వెనుక ఆంతర్యమేంటన్నారు.
'సీఎం కేసీఆర్ ఆరోగ్య సమస్య తలెత్తితే ప్రభుత్వాసుపత్రికి ఎందుకు వెళ్లరు?'
Congress Leaders on KCR: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత లోపించిందని కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి గీతారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ దిల్లీ దవాఖానాలు సందర్శించి బాగున్నట్లు ప్రశంసించారని.. హైదరాబాద్‌లో ఉన్న ఆసుపత్రులను ఎందుకు సందర్శించరని కాంగ్రెస్ నేతలు నిలదీశారు.
సీఎం కేసీఆర్ హామీలు ఇవ్వడం తప్ప ఆచరణ శూన్యమని గీతారెడ్డి మండిపడ్డారు. ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తామని హామీ ఇచ్చి 8ఏళ్లు అవుతున్నప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఆసుపత్రులే తప్ప కొత్తగా తెరాస ప్రభుత్వం వచ్చాక.. ఒక్క ఆసుపత్రిని నిర్మాణం చేయలేదని జగ్గారెడ్డి దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల కంటే ముందే గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ఇవీ చదవండి: