రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిది సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Speech at Legislative Council : బీఆర్ఎస్ ప్రభుత్వానికి మానవత్వం, మానవీయ కోణం లేదని, రైతులకు కనీస మద్దతు ధరను కూడా అమలు చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. రైతుల ఆదాయంలో తెలంగాణ దేశంలో 25వ స్థానంలో ఉందని శాసనమండలిలో ఆయన తెలిపారు.
Revanth Reddy Comments on BRS Leaders: గత పదేళ్లలో 8 వేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్‌సీఆర్ నివేదిక(NCR Report)లో ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. కర్షకుల ఆత్మహత్యలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఎన్‌సీఆర్ నివేదిక చెప్పిందని అన్నారు. రైతు బీమా కింద 1.21 లక్షల మంది రైతులకు పరిహారం ఇచ్చారని గుర్తు చేశారు. పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు పంటలకు, జీవితానికి బీమా, ధీమా ఉండాలని తెలిపారు. అన్నదాత బతికి ఉన్నప్పుడు పట్టించుకోని బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం చనిపోయాక రూ.5 లక్షలు ఇచ్చిందని మండిపడ్డారు.
ఫామ్ హౌస్ వడ్లపై విచారణకు సిద్ధమా : రేవంత్ రెడ్డి
విత్తన వరి వేయాలని ప్రజలకు కేసీఆర్ ఎందుకు చెప్పలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణ పదో స్థానంలో ఉందని స్పష్టం చేశారు. పాతబస్తీకి మెట్రో రైలు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని అన్నారు. మూసీనదిని ప్రక్షాళన చేసి పరిసరాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
"6300 సింగిల్ టీచర్ పాఠశాలలను బీఆర్ఎస్ ప్రభుత్వం మూసివేసింది. గత ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసింది. మెగా డీఎస్సీ నిర్వహించి ప్రభుత్వ విద్యా ప్రమాణాలు పెంచుతాం. టీఎస్‌పీఎస్‌సీ కమిషన్ ఏర్పాటు లోపభూయిష్టంగా ఉందని హైకోర్టు మొదట్లోనే చెప్పింది. అర్హతలేని వారిని టీఎస్‌పీఎస్‌సీలో నియమించారు. పీజీలు, పీహెచ్‌డీలు చేసినా ఉద్యోగాలు రాక యువతకు అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడగానే టీఎస్‌పీఎస్‌సీపై దృష్టి సారించాం. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యులతో మాట్లాడి రాజీనామా చేసేలా చేశాం. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిది."- రేవంత్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
'సీఎం రేవంత్ రెడ్డికి పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదు'
Revanth Reddy Speech Today: ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. జయపాల్‌రెడ్డి కృషితోనే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిందని అన్నారు. ప్రజలకు స్వేచ్ఛను ఏడో హామీగా ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు ప్రజావాణిని వింటున్నామని దీంతో మార్పును తెచ్చామని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పేదలకు ఆరోగ్యశ్రీ అందలేదని మండిపడ్డారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ(Rajiv Arogya Sri)ని తిరిగి తీసుకువచ్చి చివరి పేదవాడికి అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి ఎవరైనా, ఎప్పుడైనా సూచనలు ఇవ్వొచ్చుని వెల్లడించారు.
ఇప్పుడైనా ఇతరులకు అవకాశం ఇస్తారనుకుంటే మళ్లీ వారే మాట్లాడుతున్నారు : రేవంత్ రెడ్డి
నాయకుల మధ్య మాటల యుద్ధం - హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు