హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను మార్చారని అనుమానిస్తున్నట్టు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bjp telangana state president) వ్యాఖ్యానించారు (Bandi sanjay on huzurabad by pol). హుజురాబాద్ ఎన్నికలలో ప్రజాభిప్రాయం భాజపా వైపు ఉండడంతో తెరాస అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బండి సంజయ్ అన్నారు. నిన్న అర్ధరాత్రి జరిగిన వీవీ ప్యాట్ విషయంలో బహిర్గతమైందని పేర్కొన్నారు. హుజురాబాద్‌లో డబ్బు పంచి ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూని చేశారని సంజయ్ మండిపడ్డారు. వీవీ ప్యాట్లు పనిచేయటం లేదని ఎలా గుర్తించారని ప్రశ్నించారు. సర్వేలన్నీ తమవైపే మొగ్గు చూపుతున్నాయని... ఈవీఎంల తరలింపునకు సంబంధించి పూర్తి విచారణ జరపాలని కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల ముందు శాంతియుత నిరసన
ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరిస్తున్న తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్, జిల్లా కేంద్రాలలో నేడు గాంధీ విగ్రహాల ముందు నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సర్దార్ పటేల్ కృషితోనే కేసీఆర్ సీఎం అయ్యారు
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా (Sardar Vallabhbhai Patel Jayanti) గన్ పార్క్ వద్ద ఉన్న పటేల్ విగ్రహానికి బండి సంజయ్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సర్దార్ పటేల్ కృషితోనే నేడు కేసీఆర్ సీఎం అయ్యారన్న ఆయన.... రాష్ట్రంలో పటేల్ ని పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్ లో డబ్బు పంచి ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేశారని బండి సంజయ్ ఆరోపించారు.
'వీరుల చరిత్రను రేపటితరం గుర్తుంచుకోవాలి' తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. భారత దేశంలో విలీనమైందంటే అది సర్దార్ పటేల్ కృషి అనే విషయాన్ని ఈ తరం, రాబోయేతరం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళైనా వస్తారో లేదోమరి..! రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిజాం గొప్ప వ్యక్తికదా..! సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదు.. తెలంగాణ ఏర్పడకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివి కాదు.. ఇది పాకిస్తాన్లో కలిసేది. నీపేరు కూడా చంద్రశేఖర్ రావు కాదు... చాంద్‌పాషా అయ్యుండేది. వీరుల చరిత్రను తిరమరుగు చేసి... ఆయన చరిత్రను, ఆయన కుటుంబ సభ్యుల చరిత్రనే రాబోయే తరాలకు అందించాలని కుట్రలో భాగమే ఇలాంటి మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకాకపోవడం. ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. పద్ధతి మార్చుకోవాలి. మహనీయులను స్మరించుకోవాల్సిన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నావు నీవు. నువ్వు కొన్ని మంచి విషయాలు చెబితే సమాజం వింటుంది. కనీసం అప్పుడప్పుడూ కొన్ని మంచి విషయాలు చెబితే తెలంగాణ సమాజం నిన్ను గుర్తిస్తుంది.. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.
ఇదీ చూడండి:Huzurabad by election news: ప్రైవేటు వాహనంలో వీవీప్యాట్ తరలింపు.. భాజపా, కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన