సీఎం కేసీఆర్ (Cm Kcr) నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, గిరిజనులు, పేదవాళ్లపై ఏడేళ్ల నుంచి అనేక అకృత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు సీఎల్పీ భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). కేవలం రూ. 2 లక్షల దొంగతనం ఆరోపణలతో మరియమ్మ అనే మహిళను అన్యాయంగా, కిరాతకంగా కొట్టి చంపారని ఆవేదన వెలిబుచ్చారు. హత్యాకాండ జరుగుతున్న ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు.
సీఎం కేసీఆర్ పాలన చూస్తుంటే రాష్ట్రంలో ఎస్సీఎస్టీ, గిరిజనుల ప్రాణాలకు విలువే లేదనిపిస్తోందన్నారు. మరియమ్మ లాకప్‌లో చనిపోయి మూడు రోజులైనా... ఇప్పటి వరకు అట్రాసిటీ కేసు పెట్టలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పేద కుటుంబాల ప్రజల ప్రాణాలు, వారి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిలబడతామని భరోసానిచ్చారు. న్యాయం కోసం ఎందాకైనా వెళతామని పేర్కొన్నారు.
త్వరలోనే మానవహక్కుల కమిషన్‌ను కలుస్తామని భట్టి (Bhatti Vikramarka) అన్నారు. గవర్నర్ తమిళిసైకి లేఖ రాసినట్లు వెల్లడించారు. వారైనా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.