విశాఖ జిల్లా పాడేరు మండలం వంటల మామిడి పంచాయతీ మెట్టూరులో ఓ గిరిజన మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఉదయం నుంచి 108 కి ఫోన్ చేసినా గ్రామానికి చేరలేదు. ఈలోగా మెదడు బయటకు వచ్చిన శిశువు జన్మించింది. పరిస్థితి విషమించడంతో బైక్ అంబులెన్స్‌కి ఫోన్ చేశారు. అంబులెన్స్ చేరుకునేలోపు నాలుగు కిలోమీటర్లు డోలీ కట్టి తల్లీ బిడ్డను మోసుకెళ్లారు. మార్గంలో ఎదురువచ్చిన బైక్ ఫీడర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
అంబులెన్స్ ఆలస్యం... గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు
108కి ఫోన్ చేసినా ప్రయోజనం లేదు... ఏం చేయాలో తెలియని పరిస్థితిలో గిరిజన మహిళ ఇంటి దగ్గరే ప్రసవించింది. అయితే ఎదుగుదల లేని బిడ్డకు జన్మనిచ్చింది... తల్లీబిడ్డలను నాలుగు కిలోమీటర్లు డోలీలోనే తీసుకెళ్లారు. బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇవన్నీ విశాఖ మన్యంలో గిరిజనుల కష్టాలు.
ambulance