'అమరావతి ఆకాంక్ష చాటేలా తిరుపతిలో సభ నిర్వహిస్తాం' Amaravati Maha Padayatra: ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని నిలుపుకోవాలన్న సంకల్పంతో రైతులు చేపట్టిన పాదయాత్ర అన్ని ప్రాంతాలనూ కదిలిస్తోంది. రైతుల మహాపాదయాత్ర 30వ రోజుకు చేరుకుంది. నేడు నెల్లూరు జిల్లా అంబాపురం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అధిక సంఖ్యలో స్థానిక ప్రజల వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఆమంచర్లలో రైతులు మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. అనంతరం అక్కడినుంచి బయలుదేరి సాయంత్రం వరకు మరుపూరు వరకు పాదయాత్రను చేపట్టనున్నారు. నేడు 10 కిలో మీటర్ల మేర రైతుల మహాపాదయాత్ర సాగనుంది.
'న్యాయస్థానం నుంచి దేవస్థానం'’ పేరిట తుళ్లూరు నుంచి తిరుమల వరకూ నవంబర్ 1న మహా పాదయాత్రను చేపట్టారు. 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర... డిసెంబర్ 15న తిరుమలకు చేరుకునేలా ప్రణాళికను రూపొందించారు.
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిలాగా అందిరిలోనూ మార్పురావాలి
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మాదిరిగా వైకాపా నేతల అందరిలోనూ మార్పు రావాలని అమరావతి రైతులు ఆకాంక్షించారు. ఇప్పటికైనా ఏపీ ముఖ్యమంత్రి జగన్... మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. కుల, మతాలకు అతీతంగా పాదయాత్రలో పాల్గొనేందుకు ప్రచార రథాలు వస్తునాయని... వాటిని పోలీసులు అడ్డుకోవటం దారుణమన్నారు. అమరావతి అందరిదని చాటేందుకు తూళ్లూరు నుంచి వస్తున్న రథాలను అడ్డుకోవడం మంచిది కాదని హెచ్చరించారు
డిసెంబర్ 17న తిరుపతిలో బహిరంగసభ నిర్వహిస్తాం. అమరావతి ఆకాంక్ష చాటేలా సభ నిర్వహిస్తాం. ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ 15కు అలిపిరి చేరుకుంటాం. ఇకపై రోజుకు 15 కి.మీ. పాదయాత్ర చేస్తాం. -శివారెడ్డి, అమరావతి పరిరక్షణ ఐక్యవేదిక కన్వీనర్
ఇదీ చదవండి:Amaravati farmers Maha Padayatra: అలుపెరుగని పోరాటం.. ఏకైక రాజధానే అంతిమ లక్ష్యం