టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తానని అనుకోలేదని జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్డాతెలిపాడు. ఇదో నమ్మలేని అనుభూతి అన్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించిన అనంతరం చోప్డా స్పందించాడు.
"ప్రపంచపోటీల్లో పాల్గొనటం ఈ సంవత్సరం ఎంతో అనుభూతినిచ్చింది. నేను గతంలో ఆడిన 2-3 ప్రపంచ పోటీలు నాకు ఉపయోగపడ్డాయి. దీంతో ఒలింపిక్స్‌లో నేను ఒత్తిడికి లోనవ్వలేదు. నా ఆటపైనే దృష్టి సారించా. మొదటిసారి జావెలిన్ విసిరినప్పుడు మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను రెండోసారి కూడా బాగా వేశాను. దీంతో ఒలింపిక్ రికార్డ్ 90.57 మీటర్లను అధిగమించాలనుకున్నా.. కానీ అది జరగలేదు. త్వరలో 90 మీటర్లు సాధించటం లక్ష్యంగా పెట్టుకున్నా."
-- నీరజ్ చోప్డా, ఒలింపిక్స్ పతక విజేత
"2019లో నేను ఓపెన్ ఇంటర్నేషనల్‌కు అర్హత సాధించా. విమాన టికెట్లు కూడా బుక్ అయ్యాయి. కానీ ఆదిల్ సార్.. ఈ గేమ్స్‌లో ఆడొద్దని సూచించారు. ఒలింపిక్స్‌పై దృష్టి సారించమన్నారు. ఇప్పుడు అది నిజమైంది. ఒలింపిక్స్‌లో ఏ ఆటైనా.. ఒక్కరోజు ఈవెంట్ కాదు. సంవత్సరాల కృషి, కుటుంబ ప్రోత్సాహం ఉంది. భారత్ ఒలింపిక్స్‌లో ఎన్నో పతకాలు సాధించింది. కానీ మిల్కాసింగ్, పీటీ ఉషా లాంటి వాళ్లు పతకాలు సాధించలేకపోయారు."
-- నీరజ్ చోప్డా, ఒలింపిక్స్ పతక విజేత
'టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించటం నమ్మశక్యం కాని అనుభూతి. భారత్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించటం ఇదే మొదటిసారి. నాకు చాలా గర్వంగా ఉంది.' అని 23 ఏళ్ల యువ ఆటగాడు చోప్డా తెలిపాడు.
స్వర్ణ యాత్ర..