తెలంగాణ

telangana

ETV Bharat / sports

Euro Cup 2020: కీలక సమరానికి సిద్ధం

ప్రతిష్ఠాత్మక యూరో 2020 టోర్నీ నాకౌట్ దశకు చేరుకుంది. 16 జట్లు ప్రీక్వార్టర్స్​లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. స్టార్ ఫుట్​బాల్ ప్లేయర్ రొనాల్డో కెప్టెన్​గా ఉన్న పోర్చుగల్ జట్టు మరోసారి విజేతగా నిలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది.

Euro Cup
యూరో కప్

By

Published : Jun 26, 2021, 6:39 AM IST

ప్రతిష్ఠాత్మక యూరో 2020 ఫుట్‌బాల్‌ టోర్నీ కీలక దశకు చేరుకుంది. ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన 16 జట్లు ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. నేడే నాకౌట్‌ సమరానికి తెరలేవనుంది. 13 రోజులుగా ఆరు గ్రూపులుగా విడిపోయి 24 జట్ల మధ్య జరిగిన లీగ్‌ దశలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్లు ప్రీ క్వార్టర్స్‌ చేరాయి.

గ్రూప్‌-ఎ నుంచి ఇటలీ, వేల్స్‌, స్విట్జర్లాండ్‌, గ్రూప్‌- బి నుంచి బెల్జియం, డెన్మార్క్‌, గ్రూప్‌- సి నుంచి నెదర్లాండ్స్‌, ఆస్ట్రియా, ఉక్రెయిన్‌, గ్రూప్‌- డి నుంచి ఇంగ్లాండ్‌, క్రొయేషియా, చెక్‌ రిపబ్లిక్‌, గ్రూప్‌- ఇ నుంచి స్వీడన్‌, స్పెయిన్‌, గ్రూప్‌- ఎఫ్‌ నుంచి ఫ్రాన్స్‌, జర్మనీ, పోర్చుగల్‌ ముందంజ వేశాయి.

శనివారం తొలి ప్రీ క్వార్టర్స్‌లో వేల్స్‌తో డెన్మార్క్‌ తలపడనుంది. మిగతా మ్యాచ్‌ల్లో ఇటలీతో ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌తో చెక్‌ రిపబ్లిక్‌, బెల్జియంతో పోర్చుగల్‌, క్రొయేషియాతో స్పెయిన్‌, ఫ్రాన్స్‌తో స్విట్జర్లాండ్‌, ఇంగ్లాండ్‌తో జర్మనీ, స్వీడన్‌తో ఉక్రెయిన్‌ పోటీపడనున్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పోర్చుగల్‌ మరో టైటిల్‌పై కన్నేసింది. కెప్టెన్‌ రొనాల్డోపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇవీ చూడండి:

Messi Birthday: టిష్యూ పేపర్​పైనే కాంట్రాక్టు సంతకం!

Ronaldo:రొనాల్డో రికార్డు.. ఎవ్వరికీ అది సాధ్యం కాదేమో

ABOUT THE AUTHOR

...view details