తెలంగాణ

telangana

ETV Bharat / sports

WPL 2023: దిల్లీదే అగ్రస్థానం.. ప్లే ఆఫ్స్​కు ముంబయి-యూపీ

డబ్ల్యూపీఎల్‌లో భాగంగా జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్​లో యూపీ వారియర్స్‌పై దిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది.

UP Warriorz vs Delhi Capitals Women
డబ్ల్యూపీఎల్ 2023 దిల్లీ క్యాపిటల్స్​ విజయం

By

Published : Mar 21, 2023, 10:46 PM IST

Updated : Mar 21, 2023, 10:56 PM IST

డబ్ల్యూపీఎల్‌లో భాగంగా జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్​లో యూపీ వారియర్స్‌పై దిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్​.. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 142 పరుగులు చేసింది. మెగ్​ లానింగ్​(39) టాప్​ స్కోరర్​. అలీస్​ క్యాప్సీ(34), షెఫాలీ వర్మ(21) బాగానే రాణించారు. చివర్లో వచ్చినా మరిజన్నె కప్​(34*) కూడా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లి లక్ష్యాన్ని అందించింది. షబ్నిమ్​ ఇస్మాయిల్​ 2, యశస్రీ, సోఫీ ఎక్లిస్టోన్​ తలో వికెట్​ తీశారు. ఇకపోతే ఈ విజయంతో దిల్లీ క్యాపిటల్స్​.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి డైరెక్ట్​ ఫైనల్ బెర్త్​ను ఖరారు చేసుకుంది. ఇక రెండు, మూడు స్థానాల్లో ముంబయి ఇండియన్స్- యూపీ వారియర్స్ నిలిచాయి. ఇవి రెండు ఎలిమినేటర్(ప్లేఆఫ్స్) ఆడతాయి.

అంతకుముందు టాస్‌ ఓడి ఫస్ట్​ బ్యాటింగ్​కు దిగిన యూపీ వారియర్స్​ టీమ్​.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. తాహిలా మెక్‌గ్రాత్ (58; 32 బంతుల్లో 8x4, 2x6) హాఫ్​ సెంచరీతో జట్టుకు అండగా నిలిచింది. అలీసా హీలే (36; 34 బంతుల్లో 4x4, 1x6), శ్వేతా సెహ్రవత్‌ (19), సిమ్రాన్ షేక్ (11) పరుగులు సాధించగా.. కిరణ్ నవ్‌గిరె (2), దీప్తి శర్మ (3) ఒక్క డిజిట్‌ స్కోరు మాత్రమే చేయగలిగారు. దిల్లీ బౌలర్లలో క్యాప్సే మూడు, రాధా యాదవ్ రెండు, జోనాసెన్‌ ఒక వికెట్ తీశారు.

ఓపెనర్లు అలీసా హీలే, శ్వేతా సెహ్రావత్ యూపీ వారియర్స్​ జట్టు మంచి శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, రాధా యాదవ్‌ వేసిన ఐదో ఓవర్‌లో ఫస్ట్ బాల్​కు శ్వేతా జోనాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయింది. ఆ తర్వాత సిమ్రాన్‌, హీలే నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయితే ఈ క్రమంలోనే స్పీడ్​ పెంచుతున్న హీలేను 10 ఓవర్‌లో క్యాప్సే పెవిలియన్​ పంపింది. అనంతరం కొద్ది సేపటికే సిమ్రాన్‌ను రాధా యాదవ్‌ ఔట్​ చేసింది. జోనాసెన్‌ వేసిన 15 ఓవర్‌లో కిరణ్ నవ్‌గిరె స్టంప్​ ఔట్​గా వెనుదిరిగింది. క్యాప్సే వేసిన 17 ఓవర్‌లో దీప్తి శర్మ, ఎకిల్ స్టోన్‌ కూడా స్టంపౌట్​గా వెనుదిరిగారు. చివరి రెండు ఓవర్లలో మెక్‌గ్రాత్ దూకుడుగా ఆడటం వల్ల యూపీ వారియర్స్ కనీసం ఈ స్కోరైనా చేయగలిగింది. ఆఖరి రెండు ఓవర్లలోనే 33 పరుగులు వచ్చాయి.

ఇదీ చూడండి:ఐపీఎల్​ అన్ని సీజన్స్​ కలిపి ధోనీ సంపాదన ఎంతో తెలుసా?

Last Updated : Mar 21, 2023, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details