రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో(RCB vs KKR) ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న సునీల్ నరైన్.. టీ20 క్రికెట్‌లో అసలైన ఆటగాడని, అతడిని కలిగి ఉండటం తమకు ఎంతో ఉపయోగపడుతోందని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(Eoin Morgan IPL) సంతోషం వ్యక్తం చేశాడు. షార్జా పిచ్‌పై ఈ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ తొలుత బంతితో నాలుగు వికెట్లు తీయగా.. తర్వాత బ్యాటింగ్‌లో (26; 15 బంతుల్లో 3x6) విలువైన పరుగులు చేశాడు. దాంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
మ్యాచ్ అనంతరం మోర్గాన్ మాట్లాడుతూ నరైన్‌ను(Sunil Narine IPL) పొగడ్తలతో ముంచెత్తాడు. అతడు తమ విజయాన్ని తేలిక చేశాడని కొనియాడాడు. మరోవైపు బ్యాటింగ్‌కు కష్టంగా మారిన ఈపిచ్‌ను చూసి ఛేదనలో తాము చివరి వరకూ పోరాడాలనుకున్నట్లు తెలిపాడు. ఈ సీజన్‌లో తమ ఆటతీరు, నిలకడైన ప్రదర్శన ప్రతి ఒక్కర్నీ ఆశ్చర్యానికి గురిచేసిందని మోర్గాన్ వివరించాడు. అనంతరం నరైన్ మాట్లాడుతూ.. ఎప్పుడైనా ఇలా మ్యాచ్‌ను గెలిపించే ప్రదర్శన చేస్తే బాగుంటుందని అన్నాడు. ఈరోజు అత్యుత్తమ ప్రదర్శన చేసినట్లు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో తాను తీసిన ప్రతి వికెట్‌ను ఆస్వాదించానన్నాడు. తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు.
ఇది భారీ విజయం..