మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తున్న ఇంగ్లాండ్ జట్టు ఆ దిశగా సాగుతోంది. 378 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అతిథ్య జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 259 పరుగుల చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 119 పరుగులు కావాలి. అర్ధశతకాలతో చెలరేగిన జో రూట్(76), జానీ బెయిర్‌స్టో(72) క్రీజులో ఉన్నారు. ఇక ఒకరోజు ఆట మాత్రమే మిగిలిఉంది.
ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే 7 వికెట్లు తీయాల్సిందే. ఒకవేళ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంటుంది. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్ 125/3తో ఆట ప్రారంభించిన భారత్ మరో 120 పరుగులకే ఆలౌటైంది. పంత్(57) అర్ధశతకం చేశాడు. ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉన్న భారత్ సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్‌లో విజయమైనా సాధించాలి లేదా డ్రా అయినా చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో నెగ్గితే 2-2తో సిరీస్ సమం అవుతుంది.