తెలంగాణ

telangana

పంత్​కు ఘోర​ రోడ్డు ప్రమాదం.. కారులో చెలరేగిన మంటలు.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి..

By

Published : Dec 30, 2022, 9:09 AM IST

Updated : Dec 30, 2022, 11:35 AM IST

Indian cricketer Rishabh Pant injured in a major accident
పంత్​కు ఘోర​ రోడ్డు ప్రమాదం.. కారులో చెలరేగిన మంటలు.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి..

09:02 December 30

పంత్​కు తీవ్రగాయాలు

పంత్​కు ఘోర​ రోడ్డు ప్రమాదం.. కారులో చెలరేగిన మంటలు.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి..

టీమ్‌ఇండియా క్రికెటర్‌ పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం వాహనంలో మంటలు చెలరేగాయి. ఉత్తరాఖండ్‌ నుంచి దిల్లీ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో తన మెర్సిడెస్‌ కారును పంతే నడుపుతున్నట్లు సమాచారం అందింది. మంటలు చెలరేగగానే అతడు కారు విండో పగలగొట్టుకుని బయటకు దూకేశాడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో పంత్‌ తల, మోకాలికి గాయాలయ్యాయి. వీపు భాగం బాగా కాలిపోయింది. దీంతో పంత్​ను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అయితే ప్రస్తుతం పంత్‌ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొన్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని దేహ్రాదూన్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

కాగా, ఇటీవల బంగ్లాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్‌ ఆడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శ్రీలంకతో టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. దీంతో ఇక క్రిస్మస్‌ వేడుకలను పంత్‌.. మాజీ కెప్టెన్‌ ధోనీతో కలిసి దుబాయ్‌లో చేసుకున్నాడు.

ఇదీ చూడండి:రికార్డ్​ టైటిల్స్​తో మొదలై.. వివాదాలతో ముగిసి.. 2022 ఎంతో స్పెషల్​

Last Updated :Dec 30, 2022, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details