టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) సూపర్-12 దశలో భాగంగా తొలి మ్యాచ్ నేపథ్యంలో ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. అబుదాబిలోని షేక్ జావేద్ మైదానంలో జరుగుతున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్(AUS vs SA match) సందర్భంగా ఈ సన్నివేశం వెలుగుచూసింది. మైదానంలో అభిమానుల సీటింగ్ విధానం అందరి దృష్టినీ ఆకర్షించింది.
అభిమానులతో సందడిగా ఉండే మైదానాలు కొవిడ్ నిబంధనల కారణంగా చిన్నబోయాయి. అయితే.. టీ20 ప్రపంచకప్ కోసం పరమిత సంఖ్యలో అభిమానులకు అనుమతినిస్తామని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తెలిపింది. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
అయితే.. కొంతమంది అభిమానులు కేటాయించిన సీట్లలో కూర్చుని ఈ మ్యాచ్‌ను తిలకిస్తుండగా.. మరికొందరు ఫీల్డ్‌కు బయట ఉన్న స్పెషల్ బాక్సుల్లో కూర్చొని చిల్ కొడుతున్నారు. మైదానం యాజమాన్యమే కొవిడ్ నిబంధనల దృష్ట్యా ఈ స్పెషల్ బాక్సులను ఏర్పాటు చేసింది. ఒక బాక్సులో ముగ్గురి కంటే ఎక్కువ మంది కూర్చునే సౌలభ్యాన్ని కల్పించింది.