ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు జట్టును ప్రకటించాడు. ఇందులో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్‌గా కుమార్ సంగక్కరతో పాటు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్స్‌న్ లాంటి మేటి బ్యాట్స్‌మెన్‌కు చోటు కల్పించాడు. కెప్టెన్‌గా కోహ్లీని ఉంచినా, పాంటింగ్‌పై మండిపడుతున్నారు అభిమానులు. ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
11 మందిలో ఏడుగురు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు చెందిన వారినే తీసుకోవడం ఇందుకు ప్రధాన కారణం. ప్రపంచ అగ్ర జట్టయిన టీమిండియా నుంచి ఒక్కరినే ఎంపిక చేయడం ఏంటని ఒకరు ట్వీట్ చేయగా.. అండర్సన్, బ్రాడ్ లాంటి బౌలర్లు ఉపఖండపు పిచ్‌ల్లో సత్తాచాటలేదని మరొకరు పోస్టు చేశారు. అశ్విన్‌ను కాదని లియోన్‌ను ఎంపిక చేయడమేంటని మరొకరు స్పందించారు.