తెలంగాణ

telangana

సైబర్ వలలో ఐసీసీ.. ఏకంగా అన్ని కోట్లకు టోకరా..

By

Published : Jan 21, 2023, 10:14 AM IST

ఆన్‌లైన్‌ మోసాలకు సాధారణ ప్రజలే బలవుతారు అనుకుంటే తప్పు. ఆర్థికంగా పరిపుష్ఠమై.. అంత పెద్ద వ్యవస్థ ఉండే ఐసీసీ కూడా మోసపోయింది. ఒకసారి కాదు ఏకంగా నాలుగుసార్లు! సైబర్​ నేరగాళ్లు కోట్ల రూపాయలను టోకరా వేసినట్లు సమాచారం.

ICC cyber crime latest news
సైబర్ వలలో చిక్కుకున్న ఐసీసీ

ప్రస్తుత డిజిటల్ యుగంలో అందరూ ఆన్‌లైన్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. అయితే ఇదే సమయంలో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరిగిపోయాయి. చాలా మంది సామాన్యులు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రపంచ క్రికెట్‌ను నడిపించే బడా సంస్థైన ఐసీసీ కూడా సైబర్ వలలో పడింది. అయితే ఒకసారి కాదు ఏకంగా నాలుగుసార్లు ఆన్​లైన్ మోసగాళ్లు ఐసీసీకి టోకరా వేసి రూ.20 కోట్లు దోచుకున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయంపై ఆ సంస్థ అధికారికంగా స్పందించలేదు. కానీ తప్పు ఎక్కడ జరిగిందో అనే విషయం తెలుసుకునేందుకు అంతర్గత విచారణ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, అమెరికాకు చెందిన ఓ సంస్థకు ఐసీసీ కొనుగోలు విషయమై చెల్లింపులు చేసింది. ఏమాత్రం అనుమానం లేకుండా ఆ సంస్థకు ఈమెయిల్ ద్వారానే ఈ లావాదేవీలు నడిచాయి. అయితే తాజాగా అది ఒక తప్పుడు సంస్థ అని ఐసీసీకు తెలిసింది. దీంతో అంతర్గత విచారణకు ఐసీసీ ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details