Asia Cup 2023 IND VS PAK : వర్షం కారణంగా నిన్న(సెప్టెంబర్ 10) ఆగిపోయిన టీమ్ఇండియా-పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్ ఎట్టకేలకు రిజర్వ్ డే అయిన నేడు(సెప్టెంబర్ 11) ప్రారంభమైంది. అయితే కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. పిచ్‌ను బాగా పరిశీలించి ఓవర్లలో ఎలాంటి కోత లేకుండా మ్యాచ్‌ను షురూ చేశారు అంపైర్లు. నిన్న 24.1 ఓవర్ల వద్ద మ్యాచ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ మిగిలిన ఆ ఓవర్‌ను షాదాబ్ వేశాడు. క్రీజ్‌లోకి కేఎల్ రాహుల్, కోహ్లీ వచ్చి బ్యాటింగ్ చేశారు. వర్షం కారణంగా పిచ్ కాస్త బౌలింగ్‌కు అనుకూలిస్తోంది. దీంతో భారత బ్యాటర్లూ రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.
Super 4 Points Table Asia Cup 2023 : అయితే నేడు కూడా వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. మరి ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి? సూపర్ 4 పాయింట్ల పట్టికలో ఆయా జట్ల సమీకరణాలు ఎలా ఉంటాయి.. తెలుసుకుందాం..
- సూపర్ 4 దశలో ఉన్న ఆయా టీమ్స్.. మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్‌లో పోటీపడతాయి. ప్రస్తుతం పాకిస్థాన్, శ్రీలంక పాయింట్ల పట్టికలో రెండేసి పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. నెట్ రన్‌రేట్ ఆధారంగా ప్రస్తుతానికి పాక్ అగ్ర స్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది.
- సూపర్ 4 దశలో టీమ్‌ఇండియాకు ఇప్పుడు పాకిస్థాత్తో జరిగేదే తొలి మ్యాచ్. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. భారత్, పాకిస్థాన్‌లకు చెరో పాయింట్ పంచుకుంటాయి. అప్పుడు పాక్ 3 పాయింట్లతో మళ్లీ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. భారత్ ఒక పాయింట్ అందుకుని మూడో స్థానంలో నిలుస్తుంది.
- ఇక ఈ మ్యాచ్ రద్దైతే.. ఇక టీమ్ఇండియా పరిస్థితి కష్టంగా మారుతుంది. తర్వాతి రెండు మ్యాచుల్లో టీమ్ఇండియా కనీసం ఒకదానిలోనైనా గెలవకపోతే పరిస్థితి దారుణంగా మారుతుంది. అప్పుడు టీమ్‌ఇండియాతో పోల్చితే శ్రీలంక మెరుగైన స్థితిలో ఉంటుంది.
- టీమ్ఇండియా తన నెక్ట్స్ మ్యాచుల్లో లంక, బంగ్లాదేశ్‌లతో పోటీపడనుంది. ఆ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించదని చెప్పలేం. కాబట్టి పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ గెలిచి తీరాలి.