గోవా వేదికగా 52వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ(IFFA 2021) వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పలువురు నటులు, కళాకారులు పురస్కారాలను అందుకున్నారు. వీరిలో బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని(hemamalini awards) కూడా ఉన్నారు. ఆమెకు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. ఈ వేడుకలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ కూడా పాల్గొన్నారు.
IFFI 2021: ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న హేమమాలిని
52వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ(IFFA 2021) వేడుకలు గోవాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని(hemamalini awards) 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' పురస్కారాన్ని అందుకున్నారు.
హేమమాలినికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు
ఈ చలన చిత్రోత్సవ వేడుకలో(international film festival of india 2021 awards) తొలిసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా పాల్గొనడం విశేషం. సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారాన్ని అమెరికన్ ఫిల్మ్‌మేకర్ మార్టిన్ స్కార్సిసి, హంగేరియన్ దర్శకుడు ఇస్త్వాన్ జాబో(Istvan Szabo) అందుకున్నారు. నవంబర్ 28 వరకు ఈ చలనచిత్రోత్సవ వేడుకలు జరగనున్నాయి.
ఇదీ చూడండి:'పుష్ప' అప్డేట్.. 'బ్రో', 'క్యాలీఫ్లవర్' ట్రైలర్స్