తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విక్కీ కౌశల్​, కత్రినా మధ్య ఏం నడుస్తోంది..!

బాలీవుడ్​ యువ నటుడు విక్కీ కౌశల్​, ప్రముఖ కథానాయిక కత్రినా కైఫ్​ మధ్య ప్రేమ నడుస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విక్కీ తన ప్రేయసి హర్లీన్​ సేథీతో దూరంగా ఉంటున్నాడని.. ఈ సమయంలో కత్రినాకు దగ్గరయ్యాడని రూమర్లు వినిపిస్తున్నాయి.

విక్కీ కౌశల్​, కత్రినా మధ్య ఏం నడుస్తోంది..!

By

Published : Oct 6, 2019, 5:43 AM IST

బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌... ప్రస్తుతం హిందీ చిత్రసీమలో విలక్షణ కథలతో దూసుకెళ్తోన్న యువ నటుడు. అతడు నటించిన 'ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’' చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మేజర్‌ విహాన్‌ సింగ్‌ సెర్గిల్‌గా నటించి మెప్పించాడు. అయితే విక్కీ, బాలీవుడ్​ బార్బీ కత్రినా కైఫ్‌ల ప్రేమ బంధంపై కొన్ని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనిపై తాజాగా ఈ హీరో స్పందించాడు.

విక్కీ కౌశల్​-కత్రినా

" ఓరోజు ఉదయాన్నే నిద్ర లేచేసరికి అమ్మనాన్నలు డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఉన్నారు. నన్ను అదే పనిగా చూస్తున్నారు. నేను వారి దగ్గరికి వెళ్లి ఓ వార్తాపత్రికను తిరగేశాను. అందులో కత్రినా, విక్కీకి ఏదో బంధం ఉందని రాశారు. నేను అలా ఉండిపోయాను. నన్ను అదే పనిగా కోపంగా చూస్తూ ఉన్న అమ్మనాన్నలు... ఒక్కసారిగా గొల్లుమని నవ్వారు. హమ్మయ్య అయితే వీళ్లు ముందే వార్త చదివారా అని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నా. కత్రినాతో నాకు ఎలాంటి బంధం లేదు. కేవలం మేమిద్దరం స్నేహితులం మాత్రమే".
-- విక్కీ కౌశల్​, బాలీవుడ్​ హీరో

హీరో విక్కీకి తన మాజీ ప్రియురాలు, నటి హర్లిన్‌ సేథితో గత కొంత కాలంగా సరైన సంబంధాలు లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఎడబాటుకు కారణం బాలీవుడ్‌ నటి కత్రీనా కైఫ్​తో బంధమేనని సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

హర్లిన్‌ సేథితో విక్కీ కౌశల్​

2015లో మసాన్​ అనే చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేశాడు విక్కీ. ప్రస్తుతం 'సర్దార్​ ఉదమ్​సింగ్'​ అనే బయోపిక్​లో నటిస్తున్నాడు. ఇటీవల భారత్​ చిత్రంలో మెరిసిన 36 ఏళ్ల కత్రినా... ప్రస్తుతం అక్షయ్​కుమార్​ సరసన 'సూర్యవన్షీ' సినిమాలో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details