తెలంగాణ

telangana

MAA Elections: ఆదివారం ఉదయం 8 నుంచి పోలింగ్.. ఆరోజే ఫలితాలు

By

Published : Oct 9, 2021, 1:02 PM IST

Updated : Oct 9, 2021, 1:08 PM IST

'మా' ఎన్నికలకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్​లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ ఎన్నికలపై మాట్లాడిన ఎన్నికల సహాయాధికారి నారాయణ రావు.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు.

MAA Elections
మా ఎన్నికలు

మూవీ అర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలకు జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన రెండు ప్యానెళ్ల నుంచి మంచు విష్ణువర్ధన్, ప్రకాశ్‌రాజ్‌ తమ సభ్యులతో శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించనున్నారు. రాత్రి 8 గంటల్లోగా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల సహాయాధికారి నారాయణరావు వెల్లడించారు.

Last Updated :Oct 9, 2021, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details